Governor Assent Bills: గవర్నర్–రాష్ట్రపతి అధికారాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:51 AM
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటంపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది.
న్యూఢిల్లీ: గవర్నర్ – రాష్ట్రపతి అధికారాలపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సంబంధించిన అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించటం తగదని స్పష్టం చేసింది. కారణం చెప్పకుండా గవర్నర్‌లు బిల్లులను వెనక్కి పంపలేరని తెలిపింది. బిల్లును నిరవధికంగా నిలిపివేసే అధికారం గవర్నర్‌కు లేదని కూడా తేల్చి చెప్పింది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి పంపితేనే రాష్ట్రపతి చర్యలు తీసుకోగలరని చెప్పింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్‌కు విచక్షణాధికారం ఉందని వెల్లడించింది.
గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి పంపడం, అభిప్రాయాలతో తిరిగి పంపడం, బిల్లును పరిశీలించి సూచనలు ఇవ్వడం వంటివి మాత్రమే చేస్తారని తెలిపింది. రాష్ట్ర పరిపాలనలో తుది అధికారం ఎన్నుకోబడిన మంత్రివర్గానిదేనని స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలో రెండు ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉండవని, ప్రభుత్వం ఒక్కటే ప్రధాన నిర్ణయాధికారి అని తేల్చి చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో న్యాయస్థానం రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటంపై ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.
ఇవి కూడా చదవండి
ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం.. ఫైల్స్ విడుదల బిల్లుపై ట్రంప్ సంతకం..