Share News

Supreme Court: మీకు మంత్రి పదవా.. బెయిలా.. ఏది కావాలి..

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:11 PM

మీకు మంత్రి పదవి కావాలా.. లేక బెయిలు కావాలా.. అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి సెంథిల్‌ బాలాజీని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. సెంథిల్‌ బాలాజీపై పలు కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయన కొద్దిరోజులు జైలులో కూడా ఉన్నారు. కాగా.. ప్రస్తుతం బెయిల్‏పై ఉన్న ఆయన మంత్రి పదవిలో కొనసాగడం పట్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తంచేసింది.

Supreme Court: మీకు మంత్రి పదవా.. బెయిలా.. ఏది కావాలి..

- సెంథిల్‌ బాలాజీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

చెన్నై: మంత్రి పదవి కావాలా.. బెయిలు కావాలా.. అని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి సెంథిల్‌ బాలాజీని సుప్రీంకోర్టు(Supreme Court) న్యాయమూర్తి ప్రశ్నించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణా శాఖామంత్రిగా పనిచేసిన సెంథిల్‌ బాలాజీ ఆ శాఖలో ఉద్యోగావకాశాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురి దగ్గర పెద్దమొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని ఆయనపై ఈడీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో 2024 సెప్టెంబరులో మంత్రి సెంథిల్‌ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ వార్తను కూడా చదవండి: Raj Bhavan: అవన్నీ అవాస్తవాలు.. ఆ సమావేశం ప్రభుత్వానికి పోటీ కాదు


ఇందుకు వ్యతిరేకంగా ఈడీ బెయిల్‌పై విడుదయ్యాక సెంథిల్‌ బాలాజీ మళ్ళీ మంత్రిగా కొనసాగుతున్నారని, అందువల్ల ఆయన తన కేసుకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని అనుమానం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టులో మంత్రి సెంథిల్‌ బాలాజీ బెయిల్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా, ఇరు తరుఫు న్యాయవాదులు హాజరై వాదించారు.


nani3.3.jpg

ఆ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం మంత్రి తరఫు న్యాయవాదులనుద్దేశించి ‘మెరిట్‌ ప్రాతిపదికన తాము మీకు బెయిల్‌ మంజూరు చేయలేదు రాజ్యాంగ శాసనం సెక్షన్‌ 21ఐ ప్రకారం బెయిలు మంజూరు చేశాము. ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయలేము. సెంథిల్‌ బాలాజీకి మంత్రి పదవి కావాలా? లేకుంటే బెయిల్‌ కావాలా? దీనిపై తగిన నిర్ణయం తీసుకుని ఈ నెల 28న తెలియజేయండి’ అని ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 01:11 PM