Share News

Supreme Court: అమెరికా మాదిరి సరిహద్దు గోడ కడతారా

ABN , Publish Date - Aug 30 , 2025 | 03:19 AM

అక్రమ వలసదారులను నిరోధించడానికి అమెరికాలో మాదిరిగా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారిని ..

Supreme Court: అమెరికా మాదిరి సరిహద్దు గోడ కడతారా

  • అక్రమ వలసదార్లపై విధానమేంటి.. కేంద్రానికి సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, ఆగస్టు 29: అక్రమ వలసదారులను నిరోధించడానికి అమెరికాలో మాదిరిగా సరిహద్దుల్లో గోడ నిర్మిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన వారిని తిప్పి పంపించడానికి అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) ఏమిటని అడిగింది. వీటిపై సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. బెంగాలీ మాట్లాడుతున్న వలస కార్మికులను బంగ్లాదేశీయులు అన్న అనుమానంతో పలు చోట్ల అదుపులోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ వలసదార్ల సంక్షేమ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ ఇలాంటి విషయాల్లో అసలైన బాధితులు వేసిన పిటిషన్లను స్వీకరించాలే తప్ప సంస్థలు, సంఘాలు వేసినవి కావని అన్నారు. కొన్ని సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కూడా ఉందని, కొన్ని ప్రభుత్వాలు అక్రమ వలసదార్ల కారణంగా మనుగడ సాగిస్తున్నాయని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..

Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..

Updated Date - Aug 30 , 2025 | 03:19 AM