Share News

Supreme Court : ట్రిపుల్‌ తలాక్‌ ఎఫ్‌ఐఆర్‌ల వివరాలివ్వండి!

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:00 AM

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి భార్యకు విడాకులు ఇవ్వటానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీట్ల వివరాలను తమకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో వచ్చిన

Supreme Court : ట్రిపుల్‌ తలాక్‌ ఎఫ్‌ఐఆర్‌ల వివరాలివ్వండి!

కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 29: ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి భార్యకు విడాకులు ఇవ్వటానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీట్ల వివరాలను తమకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో వచ్చిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం’ ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పటాన్ని ఈ చట్టం నేరంగా పరిగణించి, ఆ నేరానికి పాల్పడిన వారికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తుంది. దీనిని వ్యతిరేకిస్తూ పలు ముస్లిం సంఘాలు, వ్యక్తులు సుప్రీంకోర్టులో 12 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. తలాక్‌ అనే పదాన్ని ఉచ్ఛరించటాన్ని నేరంగా పరిగణించటం అన్యాయమని, వివాహాన్ని రద్దు చేసుకున్నందుకు దేశంలో ఇతర ఏ మతసమూహమూ ఇటువంటి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవటం లేదని తెలిపారు. కేంద్రప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదిస్తూ.. ట్రిపుల్‌ తలాక్‌ను నేరంగా పరిగణించటం వల్ల అది చెప్పటానికి భయపడే పరిస్థితిని సృష్టించినట్లయ్యిందన్నారు. ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం’ కింద నిందితులకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని, మహిళా హక్కులకు సంబంధించిన చట్టాల్లో ఇదే అతి తక్కువ శిక్ష అని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘ట్రిపుల్‌ తలాక్‌కు ప్రస్తుతం చట్టబద్ధత లేదు. కాబట్టి, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన తర్వాత కూడా భార్యభర్తలు కలిసి ఉండవచ్చు. కానీ, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పినందుకు భర్తకు జైలు శిక్ష పడుతోంది. దీనినే పిటిషనర్లు వ్యతిరేకిస్తున్నారు’ అని పేర్కొంది. ఈ మేరకు ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం’ కింద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లు, చార్జిషీట్ల వివరాలను కేంద్రం సమర్పించాలని ఆదేశించింది. విచారణను మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 04:00 AM