Supreme Court: సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:05 AM
సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల విధానం అమలు చేస్తూ కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ, జూలై 1: సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల విధానం అమలు చేస్తూ కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం జూన్ 23 నుంచి అమల్లోకి వచ్చినట్టు జూన్ 24న జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) దృష్టికి తీసుకురావాలని ఉద్యోగులను కోరింది. ఉద్యోగాల్లో ఎస్సీలకు 15ు, ఎస్టీలకు 7.5ు రిజర్వేషన్లు అమలవుతాయి. రిజిస్ట్రార్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, జూనియర్ కోర్టు అసిస్టెంట్, ఛాంబర్ అటెండెంట్ల పోస్టులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.