కోటాలోనే ఎందుకు విద్యార్థులు చనిపోతున్నారు?
ABN , Publish Date - May 24 , 2025 | 05:23 AM
కోచింగ్ సెంటర్ల కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
రాజస్థాన్‌ను నిలదీసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 23: కోచింగ్ సెంటర్ల కేంద్రమైన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాదిలో ఇంతవరకు 14 మంది చనిపోవడం తీవ్రమైన విషయమని తెలిపింది. ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై శుక్రవారం విచారణ చేపట్టింది.
పిల్లల ఆత్మహత్యల నివారణకు రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. దర్యాప్తునకు సిట్‌ను నియమించినట్టు రాజస్థాన్ న్యాయవాది బదులిచ్చారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కేసు నమోదులో ఆలస్యంపైన కూడా సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.