Share News

Supreme Court: హైకోర్టు జడ్జిలకు సమాన పింఛన్‌

ABN , Publish Date - May 20 , 2025 | 04:48 AM

సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే విధమైన పింఛను విధానం ఉండాలని నిర్ణయించింది. శాశ్వత న్యాయమూర్తులు మాత్రమే పూర్తిస్థాయి పింఛనుకు అర్హులు; అదనపు న్యాయమూర్తులకు ఈ హక్కు లేదు అని స్పష్టం చేసింది.

Supreme Court: హైకోర్టు జడ్జిలకు సమాన పింఛన్‌

నియామక సమయం, హోదాతో సంబంధం లేకుండా చెల్లించాల్సిందే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ, మే 19: దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల న్యాయమూర్తులకు ఒకే తరహా పింఛను విధానం అమలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులందరూ ‘పూర్తిస్థాయి’ పింఛన్‌కు అర్హులేనని పేర్కొంది. న్యాయమూర్తుల నియామక సమయం, హోదాల ఆధారంగా పింఛను విషయంలో వివక్షకు వీల్లేదని, వివక్ష చూపిస్తే సమానత్వ హక్కు ఉల్లంఘించడమేనని తెలిపింది. శాశ్వత/అదనపు న్యాయమూర్తులుగా పనిచేసి రిటైరైనా పూర్తిస్థాయి పింఛనుకు, పదవీ విరమణ ప్రయోజనాలకు అర్హులేనని తేల్చి చెబుతూ సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. రిటైర్డ్‌ శాశ్వత న్యాయమూర్తులు మృతి చెందితే వారి కుటుంబాలకు అందిస్తున్న ప్రయోజనాలే అదనపు న్యాయమూర్తుల కుటుంబాలకూ అందించాలని ఆదేశించింది. కాగా, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో నగదు లభించిన వ్యవహారంపై అత్యవసర విచారణకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:48 AM