Supreme Court: జస్టిస్ వర్మపై దర్యాప్తు నివేదికల వెల్లడికి సుప్రీం నిరాకరణ
ABN , Publish Date - May 27 , 2025 | 05:08 AM
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నగదు లభించిన ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ ఆయనను తప్పుపడుతూ నివేదిక సిద్దించింది. అయితే, ఈ నివేదిక, సంబంధించిన లేఖలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించకూడదని సుప్రీంకోర్టు నిరాకరించింది.
అవి రహస్య పత్రాలని స్పష్టీకరణ
సమాచార హక్కు కింద దాఖలైన దరఖాస్తుకు
వివరాలు ఇవ్వలేమని సమాధానం
న్యూఢిల్లీ, మే 26: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో లభించిన నగదుకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను బయటపెట్టేందుకు సుప్రీంకోర్టు పరిపాలన విభాగం తిరస్కరించింది. సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత దర్యాప్తు కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మను తప్పుపడుతూ ఇచ్చిన నివేదిక, ఆయనను అభిశంసించి పదవి నుంచి తొలగించాలని కోరుతూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా..రాష్ట్రపతి, ప్రధానికి రాసిన లేఖలను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు నిరాకరించింది. ఇవన్నీ రహస్య పత్రాలని, బయటవారికి వెల్లడిస్తే పార్లమెంటు హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొంది. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో మార్చి 14వ తేదీ రాత్రి ఆయన నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో లక్షల రూపాయల నగదు లభించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ్ ప్రాథమికంగా విచారణ జరిపారు. అనంతరం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులుగల అంతర్గత కమిటీ విచారణ జరిపింది. ఈ నెల మూడో తేదీన నివేదిక సమర్పించింది. జస్టిస్ వర్మ తీరును తప్పుపట్టింది. నగదు తీసుకున్నట్టు నిర్ధారించింది. ఈ నివేదిక వివరాలన్నింటినీ ఇవ్వాలని సమాచార హక్కు కార్యకర్త కోరగా సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి..
PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్
మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు
జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్
ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్.. పెదవి విప్పిన జైశంకర్
For National News And Telugu News