Share News

Harassment in Odisha: ప్రొఫెసర్‌ వేధింపులతో విద్యార్థిని ఆత్మాహుతి

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:31 AM

ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక బీఈడీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కాలేజీ క్యాంప్‌సలోనే ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఒడిసాలోని బాలాసోర్‌లో...

Harassment in Odisha: ప్రొఫెసర్‌ వేధింపులతో విద్యార్థిని ఆత్మాహుతి

  • ఒడిసాలోని బాలాసోర్‌లో ఘటన

  • నలుగురు సభ్యులతో యూజీసీ కమిటీ

న్యూఢిల్లీ, జూలై 15: ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు తట్టుకోలేక బీఈడీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కాలేజీ క్యాంప్‌సలోనే ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఒడిసాలోని బాలాసోర్‌లో ఉన్న ఫకీర్‌ మోహన్‌(అటానమస్‌) కాలేజీలో జరిగిందీ దారుణం. కాలేజీలోని విద్యా విభాగాధిపతి సమీరా కుమార్‌ సాహు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు ఆరోపించారు. అయినప్పటికీ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోకపోవడంతో కాలేజీ క్యాంప్‌సలోనే శనివారం ఆమె ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. బాధితురాలిని ఎయిమ్స్‌-భువనేశ్వర్‌కు తరలించగా సోమవారం రాత్రి మృతి చెందారు. ఘటనపై యూజీసీ స్పందించింది. వాస్తవాలు గుర్తించేందుకు నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్త యూనివర్సిటీ ప్రొఫెసర్‌, యూజీసీ సభ్యుడు రాజ్‌కుమార్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ఈ కమిటీలో యూజీసీ మాజీ సభ్యురాలు సుష్మా యాదవ్‌, గుజరాత్‌ యూనివర్సిటీ మాజీ వీసీ నీరజా గుప్తా, యూజీసీ సంయుక్త కార్యదర్శి అషిమా మంగ్లా సభ్యులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 05:31 AM