Stalin letter: కలసికట్టుగా వ్యతిరేకిద్దాం
ABN , Publish Date - May 19 , 2025 | 04:59 AM
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గడువు నిర్ణయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించడాన్ని స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి ఐక్యతతో స్పందించాలని కోరారు.
‘సుప్రీం’ను రాష్ట్రపతి వివరణ కోరిన వ్యవహారంలో
రాష్ట్రాలకు స్టాలిన్ లేఖ
చెన్నై, మే 18(ఆంధ్రజ్యోతి): ‘శాసనసభలు ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు నిర్ణయించడానికి వీలుందా?’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలతో సుప్రీం కోర్టును వివరణ కోరడాన్ని కలిసికట్టుగా వ్యతిరేకించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆ మేరకు పశ్చిమబెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, పంజాబ్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖ రాశారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపేందుకు గవర్నర్, రాష్ట్రపతికి గడువును నిర్ణయిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు తమిళనాడు రాష్ట్రానికేకాక అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది’’ అన్నారు.
ఇవీ చదవండి:
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి