Share News

Srinagar Tulip Garden: తులిప్ గార్డెన్ ప్రారంభం, టికెట్ ధరల గురించి తెలుసుకోండి..

ABN , Publish Date - Mar 07 , 2025 | 06:24 PM

లక్షలాది మందిని ఆకర్షించే అందమైన తులిప్ గార్డెన్ శ్రీనగర్‌లో ఉంది. మార్చి 23న ప్రారంభం కానున్న ఈ తులిప్ గార్డెన్ టికెట్ ధర ఎంత? వాటి వివరాలను ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Srinagar Tulip Garden: తులిప్ గార్డెన్ ప్రారంభం, టికెట్ ధరల గురించి తెలుసుకోండి..
Tulip Garden

శ్రీనగర్‌లోని తులిప్ గార్డెన్ ఎంతో ప్రసిద్ధి చెందింది. పర్యాటకులను ఇది ఎంతోగానో ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. సాధారణంగా తులిప్ గార్డెన్‌ను మార్చి చివరిలో తెరిచి ఏప్రిల్ చివరి నాటికి మూసివేస్తారు. అయితే, ఈసారి మాత్రం ఈ అందమైన గార్డెన్‌ను కాస్త ముందుగానే తెరుస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. తులిప్ గార్డెన్ ప్రారంభం ఎప్పుడు? దాని టిక్కెట్ ధరలు ఎంత అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రీనగర్ తులిప్ గార్డెన్ ప్రారంభ తేదీ

నివేదికల ప్రకారం, ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ మార్చి 23, 2025న ప్రారంభించనున్నారు. దీని సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ అందమైన పూల తోట ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్‌గా పేరు పొందింది. ఈ ఉద్యానవనం ప్రతిరోజూ ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు తెరిచి ఉంటుంది.

తులిప్ గార్డెన్ శ్రీనగర్ టికెట్ ధరలు

తులిప్ గార్డెన్‌ లోకి ప్రవేశించడానికి ముందుగా మీరు టికెట్ తీసుకోవాలి. గత సంవత్సరం ధరల ప్రకారంగానే, టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.

  • పెద్దలు ఒక్కొక్కరికి రూ. 75

  • 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు రూ. 30

  • విదేశీ పర్యాటకులు రూ. 200 చెల్లించాలి.

  • ఈ ధరలన్నీ GSTతో కలిపి ఉంటాయి.


కాశ్మీర్ నివేదిక ప్రకారం..

2007 వరకూ సిరాజ్ గార్డెన్స్ పేరుతో ఉన్న ఈ పూలతోటను తర్వాత ఆధుననీకరించి ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌గా పేరు మార్చారు. ఈ ఉద్యానవనం దాదాపు 74 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాల్ సరస్సు కూ జబర్వాన్ పర్వతాలకు మధ్య నిర్మించిన ఈ అందమైన తోట కాశ్మీర్ టూరిజంలో చాలా ఫేమస్. ఈ గార్డెన్‌లో రంగురంగుల తులిప్ మొక్కలు దాదాపు 17 లక్షలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ సంవత్సరం గార్డెన్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయని తులిప్ గార్డెన్ అసిస్టెంట్ ఫ్లోరికల్చర్ ఆఫీసర్ ఆసిఫ్ అహ్మద్ తెలిపారు. ప్రతి సంవత్సరం తాగే ఈ సంవత్సరం కూడా తాము గార్డెన్‌ను మరింత అందంగా తయారుచేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

కుప్పకూలిన ఐఏఎఫ్ జాగ్వార్ విమానం

ఈ రైల్వే స్టేషన్లలో కూడా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు..

Updated Date - Mar 07 , 2025 | 06:30 PM