Share News

Supreme Court: జీవిత భాగస్వామి సంభాషణల రికార్డుల్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:30 AM

జీవిత భాగస్వామితో జరిపిన సంభాషణల రహస్య రికార్డులను వివాహసంబంధ కేసుల్లో సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court: జీవిత భాగస్వామి సంభాషణల రికార్డుల్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు

  • పరస్పర నిఘా అంటేనే.. ఆ భార్యాభర్తల మధ్య బంధం లేదని..

  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • పంజాబ్‌-హరియాణా హైకోర్టు తీర్పు కొట్టివేత

  • వివాహ సంబంధ కేసుల్లో దీనికి ఓకే

జీవిత భాగస్వామితో జరిపిన సంభాషణల రహస్య రికార్డులను వివాహసంబంధ కేసుల్లో సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంజాబ్‌కు చెందిన ఓ భార్యాభర్తల కేసులో సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. తొలుత భటింటాలోని ఫ్యామిలీకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. తన భార్య తన మీద తీవ్రమైన వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. అందుకు ఆధారంగా, ఆమెతో గతంలో జరిపిన ఫోన్‌ సంభాషణల ఆడియో రికార్డులున్న సీడీని కోర్టులో సమర్పించాడు భర్త. ఆ సీడీని సాక్ష్యంగా తీసుకోవటానికి ఫ్యామిలీ కోర్టు అంగీకరించింది. అయితే, ఫోన్‌ సంభాషణల రికార్డు వ్యక్తిగత గోప్యతకు భంగకరమని హైకోర్టు వాటిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో, భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆడియో రికార్డుల్ని సాక్ష్యంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - Jul 15 , 2025 | 05:30 AM