Share News

Scorpio Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం.. స్కార్పియో కారు అదుపు తప్పి బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టడంతో..

ABN , Publish Date - Jul 05 , 2025 | 07:00 PM

యూపీలో షాకింగ్ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్‌లో స్కార్పియో కారు అదుపు తప్పి బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించారు.

Scorpio Accident: షాకింగ్ రోడ్డు ప్రమాదం.. స్కార్పియో కారు అదుపు తప్పి బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టడంతో..
Scorpio accident Prayagraj

ఇంటర్నెట్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వేగంగా దూసుకెళ్లిన ఓ స్కార్పియో కారు బిల్ బోర్డు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో, స్తంభానికి అమర్చిన భారీ బిల్ బోర్డు కింద పడిపోగా ప్రమాదం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యి బోల్తా పడింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలు ఏవీ లేకపోవడంతో ఇతరులెవరికీ ఎలాంటి అపాయం కలగలేదు. మరోవైపు స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్టు తెలిసింది.


అంతకుమునుపు, సంబల్ జిల్లాలో ఓ ఎస్‌యూవీ అదుపు కోల్పోయిన గోడను ఢీకొట్టడంతో వాహనంలోని పెళ్లి కొడుకు సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మూడేళ్ల బాలిక కూడా కన్నుమూసింది. ప్రమాద సమయంలో కారులో పది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వారంతా పెళ్లికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. పది మంది ప్యాసెంజర్‌లతో వెళుతున్న కారు అదుపు కోల్పోయి కాలేజీ గోడను ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. డ్రైవర్ పొరపాటు వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు బోల్తా పడి గోడను ఢీకొట్టిందని అన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి

ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 07:08 PM