Share News

Kannada controversy: కన్నడ పాట పాడాలన్న విద్యార్థిపై సోనూ అసహనం

ABN , Publish Date - May 04 , 2025 | 04:44 AM

కన్నడ పాట పాడమన్న అభిమాని విజ్ఞప్తిని పహల్గాం దాడితో పోల్చిన గాయకుడు సోను నిగమ్‌పై కన్నడ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ వ్యాఖ్యలపై సోనును వెంటనే బ్యాన్‌ చేయాలని కర్ణాటక రక్షణ వేదిక డిమాండ్‌ చేసింది.

Kannada controversy: కన్నడ పాట పాడాలన్న విద్యార్థిపై సోనూ అసహనం

ఇలాంటి డిమాండ్లతోనే పహల్గాం దాడి జరిగిందని వ్యాఖ్య

బెంగళూరు, మే 3(ఆంధ్రజ్యోతి): కన్నడ పాట పాడమని ఓ అభిమాని కోరడంతో అసహనానికి గురైన గాయకుడు సోను నిగమ్‌, అతని డిమాండ్‌ను పహల్గాం దాడితో పోల్చాడు. దీంతో సోనునిగమ్‌పై కన్నడ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. బెంగళూరు నగరంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో వారం క్రితం నిర్వహించిన కార్యక్రమంలో సోనునిగమ్‌ బృందం పాల్గొంది. అన్నీ హిందీ పాటలే పాడుతుండటంతో కన్నడ పాటలు పాడాలని ఓ అభిమాని కోరారు. దీంతో ఆగ్రహించిన సోను నిగమ్‌, ‘కన్నడ.. కన్నడ..! ఇలాంటి డిమాండ్లతోనే పహల్గాం దాడి జరిగింది’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. సోను నిగమ్‌ను కన్నడ సినిమా రంగం వెంటనే బ్యాన్‌ చేయాలని కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణగౌడ డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 04:44 AM