Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:55 AM
ఎమ్మారైతో సహా పలు పరీక్షలు నిర్వహించాక ఆమె ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అధిక రక్తపోటుతో ఆస్పత్రికి వెళ్లిన ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సిమ్లా, జూన్ 7: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ శనివారం అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఇందిరాగాంధీ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. ఎమ్మారైతో సహా పలు పరీక్షలు నిర్వహించాక ఆమె ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అధిక రక్తపోటుతో ఆస్పత్రికి వెళ్లిన ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా కుమార్తె ప్రియాంకగాంధీతో కలిసి సోనియా వ్యక్తిగత పర్యటనకు సిమ్లా వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా ఆమె అస్వస్థతతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పుడు వైద్యులు పెద్దగా సమస్య ఏమీ లేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య
భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..