Share News

Chennai: తండ్రి హత్యకు ప్రతీకారం

ABN , Publish Date - Aug 08 , 2025 | 05:43 AM

అప్పుడు ఆ పిల్లాడి వయసు రెండేళ్లు. ఆ చిన్నారి కళ్లెదుటే తండ్రిని పాశావికంగా నరికి చంపేశారు. అతడు పెరిగి పెద్దయ్యాడు. అతనితోపాటు తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగా పెరుగుతూ వచ్చింది.

Chennai: తండ్రి హత్యకు ప్రతీకారం

  • 17 ఏళ్ల తర్వాత రౌడీషీటర్‌ను చంపేసిన విద్యార్థి

చెన్నై, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): అప్పుడు ఆ పిల్లాడి వయసు రెండేళ్లు. ఆ చిన్నారి కళ్లెదుటే తండ్రిని పాశావికంగా నరికి చంపేశారు. అతడు పెరిగి పెద్దయ్యాడు. అతనితోపాటు తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగా పెరుగుతూ వచ్చింది. అంతేకాదు.. ఆ హత్య చేసిన వ్యక్తి కనిపించినప్పుడల్లా.. ‘మీ నాన్నను నడిరోడ్డుపై చంపింది నేనేరా’ అంటూ హేళన చేస్తున్నాడు. అంతే అతడిని చంపేయాలని నిర్ణయానికొచ్చాడు. ఇదేమీ సినిమా కథ కాదు. తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం జరిగిన యథార్థ సంఘటన.


ఆ కుర్రాడి పేరు యువనేష్‌. బీబీఏ చదువుతున్నాడు. అతడి చేతిలో హత్యకు గురయ్యింది రౌడీషీటర్‌ ఫుల్‌కాన్‌ రాజ్‌కుమార్‌ (42). ఈ రాజ్‌కుమార్‌ 2008లో చెన్నై శివారు ప్రాంతమైన టీపీ సత్రం వద్ద పేరుమోసిన రౌడీ సెంథిల్‌ను హత్య చేశాడు. తండ్రిని చంపేసిన రాజ్‌కుమార్‌పై కోపం పెంచుకున్న యువనేష్‌.. బుధవారం రాత్రి నలుగురు స్నేహితులతో వెళ్లి.. ఇంట్లో నిద్రిస్తున్న రాజ్‌కుమార్‌ను చంపేశాడు. పోలీసులు.. యువనే్‌షను, అతడి ఇద్దరు స్నేహితులను గురువారం అరెస్టు చేశారు.

Updated Date - Aug 08 , 2025 | 05:43 AM