Share News

Israel Attack: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతి

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:22 AM

ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతిచెందారు. గాజాలోని నాసెర్‌ మెడికల్‌ కాంప్లెక్స్‌ ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు, ఖాన్‌యూని్‌సలో జరిపిన దాడిలో మరో జర్నలిస్టు మృతిచెందారు.

Israel Attack: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతి

  • విచారం వ్యక్తం చేసిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

గాజా, టెల్‌ అవీవ్‌, ఆగస్టు 25: ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఆరుగురు జర్నలిస్టులు మృతిచెందారు. గాజాలోని నాసెర్‌ మెడికల్‌ కాంప్లెక్స్‌ ఆసుపత్రిపై జరిపిన దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు, ఖాన్‌యూని్‌సలో జరిపిన దాడిలో మరో జర్నలిస్టు మృతిచెందారు. మృతుల్లో అల్‌ జజీరాకు చెందిన మొహమ్మద్‌ సలామా, రాయ్‌టర్స్‌కు చెందిన హుస్సామ్‌ అల్‌ మస్రీ, ఖుద్స్‌ ఫీడ్‌ నెట్‌వర్క్‌కు చెందిన అహ్మద్‌ అబు అజీజ్‌, అసోసియేటెడ్‌ ప్రెస్‌కు చెందిన మరియం డఖ్ఖా, గాజా ప్రభుత్వ మీడియాకు పనిచేస్తున్న మోయిజ్‌ అబూ తాహా, అల్‌ హయత్‌ అల్‌ జదియాకు చెందిన హస్సాన్‌ దౌహాన్‌ ఉన్నారు.


వాస్తవానికి నాసెర్‌ ఆసుపత్రిపై జరిపిన దాడిలో మొత్తం 21 మంది చనిపోయారు. వీరిలో ఐదుగురు జర్నలిస్టులే. ఇజ్రాయెల్‌ దాడిని ఐక్యరాజ్యసమితితో పాటు పలు మీడియా సంస్థలు ఖండించాయి. ఈ నెల 10న ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో నలుగురు అల్‌జజీరా జర్నలిస్టులు మృతిచెందారు. కాగా, ఇజ్రాయెల్‌ బలగాల దాడిలో జర్నలిస్టుల మృతిపై ప్రధాని నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 26 , 2025 | 01:22 AM