Share News

Chennai: 48 గంటల్లో తొలగించాలి... లేకుంటే లీగల్‌ చర్యలు

ABN , Publish Date - May 27 , 2025 | 01:00 PM

48 గంటల్లో.. ఆ పోస్టులన్నీ తొలగించాలి... లేకుంటే లీగల్‌ నోటీసులు పంపుతానని గాయని కెనీషా ఫ్రాన్సిస్‌ హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ... తనకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు, కంటెంట్‌లను 48 గంటల్లో తొలగించాలని ఆమె అన్నారు.

Chennai: 48 గంటల్లో తొలగించాలి... లేకుంటే లీగల్‌ చర్యలు

- కెనీషా ఫ్రాన్సిస్‌

చెన్నై: తనకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన కంటెంట్‌, అసత్య కథనాలు, వీడియోలను 48 గంటల్లో తొలగించాలని లేనిపక్షంలో లీగల్‌ నోటీసులు పంపుతామని బెంగళూరుకు చెందిన గాయని కెనీషా ఫ్రాన్సిస్‌(Kenisha Francis) హెచ్చరించారు. ఈ విషయంపై ఆమె తరపు న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ కెనీషా గురించి వార్తా కథనాలు, వీడియోలు, అసభ్యకరమైన ఫొటోలను 48 గంటల్లో తొలగించాలని అందులో పేర్కొన్నారు.


కాగా, హీరో రవి మోహన్‌ - ఆర్తి రవి దంపతులు విడిపోవడానికి గాయని కెనీషా ఫ్రాన్సిస్‌ కారణం అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో జరిగిన ఓ నిర్మాత కుమార్తె వివాహానికి రవి మోహన్‌ - కెనీషా ఫ్రాన్సిస్ జంటగా హాజరుకావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్టయింది. దీంతో కెనీషాకు సంబంధించి అనేక కథనాలు, వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


nani5.2.jpg

అదేసమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్‌ చేసి చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ బెదిరించినట్టు కెనీషా వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు, కంటెంట్‌లను 48 గంటల్లో తొలగించాలని ఆమె తన న్కాయవాది తరపున కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

Read Latest Telangana News and National News

Updated Date - May 27 , 2025 | 01:00 PM