Share News

Simla Agreement: సిమ్లా ఒప్పందం..ఎందుకు జరిగిందో తెలుసా... అసలు కథేంటి

ABN , Publish Date - Apr 25 , 2025 | 08:44 AM

Simla Agreement: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి భారత్ కీలక నిర్ణయాలు తీసుకొంటే.. పాక్ సైతం అదే దారిలో వెళ్తోంది. ఆ క్రమంలో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.

Simla Agreement: సిమ్లా ఒప్పందం..ఎందుకు జరిగిందో తెలుసా... అసలు కథేంటి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్‌‌లోని పహల్గాంలో ఉగ్రదాడి సందర్బంగా 26 మంది మృతి చెందిన నేపథ్యంలో పాకిస్థాన్ విషయంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం స్పందించింది. భారత్ , పాకిస్థాన్ మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అసలు సిమ్లా ఒప్పందం ఎందుకు జరిగింది. ఎప్పుడు జరిగింది. ఈ ఒప్పందంపై ఎవరు సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి ఈ రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయా? లేక ఉల్లంఘించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే..

simla.jpg

ఇందిరా గాంధీ, బుట్టో మధ్య ఒప్పందం..

1971లో భారత్ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. ఇది 1972, జులై 2వ తేదీన హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టో మధ్య జరగడంతో.. ఈ ఒప్పందంపై వీరిద్దరు సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆగస్ట్ 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

మూడో పక్షం జోక్యం..

ఈ ఒప్పదం ప్రకారం.. ఈ ఇరు దేశాల మధ్య ఏమైనా వివాదాలు తలెత్తితే.. శాంతియుతంగా.. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది. అయితే మూడో పక్షం జోక్యం ఉండకోడదని పేర్కొంది. అలాగే ఈ ఒప్పందం ప్రకారం..1971 నాటి కాల్పుల విరమణ..నియంత్రణ రేఖ (లైన్ అఫ్ కంట్రోల్ - ఎల్ఓసీ)గా గుర్తించి, దానిని ఏకపక్షంగా మార్చరాదని ఇరు దేశాలు అంగీకరించాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని,పరస్పర ప్రాదేశిక సమగ్రతను,సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవాలని కూడా ఈ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు.


పొరుగు దేశం ఉల్లంఘనలు..

PAK.jpgఈ ఒప్పందం జరిగినా.. పాకిస్థాన్ మాత్రం తన దుందుడుకు చర్యలను వదిలి పెట్టలేదు. భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా.. పొరుగుదేశం పాక్ మాత్రం పలుమార్లు కవ్వింపు చర్యలు దిగుతూనే ఉంది. భారత్, పాక్ మధ్య పలుమార్లు యుద్ధం జరిగిగా.. వాటిలో భారత్ గెలుస్తునే వస్తోంది. అయితే జమ్మూ కశ్మీర్ లక్ష్యంగా ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆ దేశం పెంచి పోషిస్తోంది. ఇక గతంలో అంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జమ్మూ కశ్మీర్‌లో బాంబు పేలుళ్లు, కాల్పులు తరచూ జరిగేవి. కానీ కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొలువు తీరిన అనంతరం ఈ ఘటనలు చాలా వరకు తగ్గాయి.


మూడోసారి ప్రధానిగా..

PM-Modi.jpgమరోవైపు ప్రధానిగా మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే రియాసీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్నపై ఉగ్రమూకలు కాల్పులు జరిపింది. దీంతో బస్సు లోయలో పడి పలువురు మరణించిన సంగతి తెలిసింది. నాటి నుంచి జమ్మూ కాశ్మీర్‌లో పలుమార్లు ఉగ్రవాదులు దాడులు జరుపుతోన్నారు.


పహల్గాంలో ఉగ్రదాడి.. భారత్ కీలక నిర్ణయం

terror-attack.jpgఏప్రిల్ 22వ తేదీన అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఆ క్రమంలో పాకిస్థాన్‌తో చేసుకొన్న సింధు జాలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అలాగే న్యూఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలు ఏప్రిల్ 27వ తేదీ వరకే అమల్లో ఉంటాయని.. ఆ తర్వాత రద్దు చేస్తామని భారత్ ప్రకటించింది. ఇలా పాకిస్థాన్‌పై భారత్ కీలక నిర్ణయాలు తీసుకొంది.


స్పందించిన పాకిస్థాన్..

ఈ నేపథ్యంలో పాక్ సైతం స్పందించింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదీకాక భారత్, పాక్ దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద పొరుగుదేశం కాల్పులకు తెగబడుతోంది. తద్వారా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ విధంగా గతంలో చేసుకొన్న సిమ్లా ఒప్పందాన్ని పాక్ ఏనాడు గౌరవించలేదని ఆ దేశ చర్యలను పరిశీలిస్తే ఇట్టే అవగతమవుతోంది.

For National News And Telugu News

Updated Date - Apr 25 , 2025 | 09:14 AM