Sikh Pilgrim Sarabjit Kaur: పాకిస్తాన్ వ్యక్తితో పెళ్లి.. వైరల్‌గా మారిన సిక్కు మహిళ వీడియో..
ABN , Publish Date - Nov 16 , 2025 | 07:47 AM
తీర్థయాత్రల కోసం పాకిస్తాన్ వెళ్లిన ఓ సిక్కు మహిళ కుటుంబానికి, భారత అధికారులకు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తీర్థయాత్రల కోసం పాకిస్తాన్ వెళ్లిన సిక్కు మహిళ శరబ్‌జిత్ కౌర్ అక్కడి ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించి ‘నిఖానమా’ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు శరబ్‌జిత్ కౌర్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పాకిస్తాన్, షేక్‌పురకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను పెళ్లి చేసుకోవడానికి కౌర్ మనస్పూర్తిగా అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. తాను నాసిర్‌ను ప్రేమిస్తున్నానని అంది. నాసిర్ కూడా కౌర్‌ను పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలిపాడు.
కౌర్ తన మతాన్ని మార్చుకుని నాసిర్‌ను పెళ్లి చేసుకుంది. రవీందర్ సింగ్ రాబిన్ అనే వ్యక్తి ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆమె సడెన్‌గా మాయం అవ్వటం, పెళ్లి వీడియో బయటకు రావటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కౌర్ తన ఇష్ట ప్రకారమే ఇలా చేసిందా? లేక బలవంతంగా పెళ్లి చేశారా? అన్నదానిపై దర్యాప్తు జరిపించాలని భారత అధికారులను కోరుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
పాకిస్తాన్‌లోని సిక్కు ఆలయాలను సందర్శించడానికి పంజాబ్ నుంచి 1992 మంది నవంబర్ 4వ తేదీన పాకిస్తాన్ వెళ్లారు. వారిలో కపుర్తలాకు చెందిన శరబ్‌జిత్ కౌర్ కూడా ఉంది. పది రోజుల పాటు అందరూ పాకిస్తాన్‌లో పర్యటించారు. పది రోజుల యాత్ర ముగిసిన తర్వాత నవంబర్ 13వ తేదీన వారంతా తిరిగి వచ్చారు. అయితే, వారిలో కౌర్ మాత్రం లేదు. దీంతో అధికారులు ఆమె గురించి వెతకటం మొదలెట్టారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ‘నిఖానమా’ ఫొటో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
మళ్లీ చెబుతున్నాం... మీ వాదనలతో విభేదిస్తున్నాం
ఆ రాశి వారికి ఈ వారం భారీగా ధన లాభం...