Kerala: నగ్నంగా నిలబెట్టి.. మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి..
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:49 AM
ఆపై మర్మాంగాలకు కంపా్‌సలోని పదునైన పరికరాలను గుచ్చి తీవ్రంగా గాయపర్చారు. ఒకట్రెండ్రోజులు కాదు.. ఏకంగా మూడునెలల పాటు వారి దమనకాండ కొనసాగింది.

ర్యాగింగ్ పేరుతో ముగ్గురు జూనియర్లకు సీనియర్ల నరకం
కేరళలోని కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ఘటన
కొట్టాయం, ఫిబ్రవరి 12: కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో జూనియర్లను నగ్నంగా నిలటెట్టి.. వారి మర్మాంగాలకు కసరత్తుల కోసం ఉపయోగించే డంబెల్స్ వేలడదీశారు. ఆపై మర్మాంగాలకు కంపా్‌సలోని పదునైన పరికరాలను గుచ్చి తీవ్రంగా గాయపర్చారు. ఒకట్రెండ్రోజులు కాదు.. ఏకంగా మూడునెలల పాటు వారి దమనకాండ కొనసాగింది. కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఈ దారుణం జరిగింది. మూడో సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న ముగ్గురిని ఈ విధంగా చిత్రహింసలకు గురిచేశారు. రక్తమోడుతున్న గాయాలపై బాధితులు లోషన్ పూసుకుంటే, ఇది తెలిసి ఆ ముగ్గురు సీనియర్లు మరింత రెచ్చిపోయారు. ఆ లోషన్‌ను బలవంతంగా బాధితుల నోట్లో పిండి పైశాచికానందం పొందారు. బాధితుల పట్ల తమ దుశ్చేష్టలన్నీ వీడియో తీశారు. ఎవరికైనా చెప్తే అకడమిక్ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరించారు. అయితే, వారి రాక్షస చర్యలు ఎలా బయటపడ్డాయంటే.. సదరు ఐదుగురు సీనియర్లు మద్యానికి బానిసలు! జూనియర్ విద్యార్థుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు. వారి చిత్రహింసలు భరించలేక.. ఓ విద్యార్థి తన గోడునంతా ఫోన్లో తండ్రితో చెప్పుకొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ కుమారుడికి ఆయన చేసిన సూచనే ర్యాగింగ్ భూతాన్ని బయటపెట్టింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..
Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి
Also Read: మరోసారి కుల గణన సర్వే
Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు
Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం
For AndhraPradesh News And Telugu News