Supreme Court: పోలీసులు వాట్సప్ ద్వారా నోటీసులు పంపొద్దు
ABN , Publish Date - Jan 29 , 2025 | 01:48 AM
కోర్టు వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నప్పటికీ విచారణకు సంబంధించిన నోటీసులను వాట్సప్ ద్వారా పంపించడం నిబంధనలకు విరుద్ధమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 28: కోర్టు వ్యవహారాల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నప్పటికీ విచారణకు సంబంధించిన నోటీసులను వాట్సప్ ద్వారా పంపించడం నిబంధనలకు విరుద్ధమని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేయడానికి ముందు విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ పంపే నోటీసులు, సీఆర్‌పీసీలోని సెక్షన్ 41ఏ, బీఎన్‌ఎ్‌సఎ్‌సలోని సెక్షన్ 35 ప్రకారం పంపే నోటీసులకు ఎలకా్ట్రనిక్ మాధ్యమాలను ఉపయోగించకూడదని తెలిపింది. కేవలం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో పేర్కొన్న విధానాల్లోనే పంపాలని తెలిపింది. ఎలకా్ట్రనిక్ మార్గాన్ని ప్రత్యామ్నాయ విధానంగా పరిగణించలేమంది.