Share News

Sagarmala: దేశపు మొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ సంస్థ సాగర్‌ మాల ఫైనాన్స్

ABN , Publish Date - Jun 26 , 2025 | 05:51 PM

భారతదేశపు మొట్టమొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ.. సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రారంభించారు.

Sagarmala: దేశపు మొదటి మేరీ టైం నాన్-బ్యాంకింగ్ సంస్థ సాగర్‌ మాల ఫైనాన్స్
Sagarmala

న్యూఢిల్లీ జూన్ 26: భారతదేశపు మొట్టమొదటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) సాగర్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (SMFCL)ను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ ఇవాళ ప్రారంభించారు. ఇది సముద్ర రంగంలో భారతదేశపు మొట్టమొదటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. గతంలో సాగరమాల డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు SMFCLగా మారి అమృత్ కాల్ విజన్ 2047కి అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఇది దేశ సముద్ర మౌలిక సదుపాయాల కల్పన, వాటి అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది.


SMFCL మినీ రత్న కంపెనీ. కేటగిరీ-Iలో ఉన్న ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్‌ను జూన్ 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)గా గుర్తించింది. మన ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోన్న సముద్ర రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ సంస్థ ఎంతగానో దోహదపడుతుంది. ఈ సంస్థ మేరీ టైం రంగంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. ఓడరేవులు, MSMEలు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలను శక్తివంతం చేసేందుకు కూడా ఈ సంస్థ ఆర్థిక సహకారం అందిస్తుంది.


సముద్ర రంగంలో ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడంతో పాటు, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి SMFCL ఆర్థికంగా ఎంతో సపోర్ట్ ఇస్తుంది. ఈ కార్పొరేషన్ ద్వారా పోర్ట్ అథారిటీలు, షిప్పింగ్ కంపెనీలు, MSMEలు, స్టార్టప్‌లు, మేరీ టైం ఇన్సిట్యూషన్స్ వంటి విభిన్న శ్రేణి సంస్థలకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక నిధులు సమకూరుస్తుందీ సంస్థ.


ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 26 , 2025 | 05:51 PM