Russian Woman: ఆధ్యాత్మికతతో కాదు ప్రకృతిపై ప్రేమతో
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:20 AM
ప్రకృతిలో జీవించేందుకు తాను ఇష్టపడతానని రష్యా మహిళ నీనా కుటీనా(40) తెలిపారు. తాను, తన ఇద్దరు పిల్లలు ప్రకృతిలో...
అడవిలో మేము సంతోషంగానే ఉన్నాం
20 దేశాల్లో అలాగే గడిపాం: రష్యా మహిళ నీనా
బెంగళూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రకృతిలో జీవించేందుకు తాను ఇష్టపడతానని రష్యా మహిళ నీనా కుటీనా(40) తెలిపారు. తాను, తన ఇద్దరు పిల్లలు ప్రకృతిలో సంతోషంగా ఉన్నామని, అయితే తమ గురించి మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఆధ్యాత్మికత ప్రేరణతోనే తాను ఇలా చేస్తున్నానని అనడం సరికాదని, తాను ప్రకృతిని మాత్రమే ప్రేమిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ గుహ వద్ద ఇద్దరు పిల్లలతో నివసిస్తున్న ఆమెను కర్ణాటక పోలీసులు ఇటీవల బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తుమకూరులోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీ్‌స(ఎ్‌ఫఆర్‌ఆర్‌ఓ)లో ఉంటున్న ఆమె.. ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడారు. తన పిల్లలు ప్రాయ(6), అమా(4)తో కలిసి అటవీ ప్రాంతంలోని గుహలో ప్రశాంతంగా గడిపామని అన్నారు. తాను చనిపోదలచుకోలేదని, అలాగే తన పిల్లలను చంపేందుకు ఇక్కడకు తీసుకురాలేదని స్పష్టం చేశారు. తన పిల్లలు అడవిలో చాలా సంతోషంగా గడిపారని అన్నారు. బంకమట్టితో ఎన్నో బొమ్మలు చేశామని, వాటికి రంగులు వేశామని వివరించారు. గ్యాస్ ఉపయోగించే వంట చేశామని తెలిపారు. కొన్నేళ్లుగా తాము 20 దేశాల్లో ఇదే తరహాలో గడిపామని అన్నారు. 2017 నుంచి తాము ఆ గుహలో ఉన్నామనేది అబద్ధమని కొట్టిపారేశారు. పోలీసులకు తమ పాత పాస్‌పోర్ట్‌లు దొరికాయని, వాటిని పరిశీలించలేదని తెలిపారు. తన పెద్ద కుమారుడు మృతిచెందాక వీసా పొందడం సాధ్యం కాలేదని, ఈలోగా భారత్ వీసా గడువు ముగిసిందని తెలిపారు. 2017 తర్వాత నాలుగు దేశాలు తిరిగామని చెప్పారు. తన వద్ద టెలిగ్రాం చానెల్ ఉందని, తాము ఆ గుహలో ఏం చేశామనేది రికార్డు చేసి అందులో పోస్టు చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి