Share News

Air Defense System: భారత్‌కు మరో రెండు స్క్వాడ్రన్ల ఎస్‌-400

ABN , Publish Date - Jun 03 , 2025 | 05:31 AM

రష్యా ఉపరాయబారి రోమన్ బాబుష్కిన్ ప్రకారం 2025-26 నాటికి మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్లు భారత్‌కు అందజేయబడతాయి. ఇటీవల జరిగిన భారత్-పాక్ ఘర్షణలలో ఎస్-400 వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసిందని ఆయన తెలిపారు. డ్రోన్లపై నియంత్రణ కోసం యాంటీ-డ్రోన్ సాంకేతికతను భారతదేశంతో రష్యా భాగస్వామ్యం విస్తరించే భాగంగా చర్చలు జరుగుతున్నాయి.

 Air Defense System: భారత్‌కు మరో రెండు స్క్వాడ్రన్ల ఎస్‌-400
S-400

  • వచ్చే ఏడాది నాటికి అందజేస్తాం

  • రష్యా ఉప రాయబారి బాబుష్కిన్‌ వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 2: ముందు అనుకున్న ప్రకారమే 2025-26 నాటికి మిగిలిన రెండు స్క్వాడ్రన్ల ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్‌కు అందజేస్తామని.. భారత్‌లో రష్యా ఉప రాయబారి రోమన్‌ బాబుష్కిన్‌ స్పష్టం చేశారు. ఇటీవలి భారత్‌-పాకిస్థాన్‌ ఘర్షణల సందర్భంగా ఎస్‌-400 సమర్థవంతంగా పని చేసినట్లు తమకు తెలిసిందన్నారు. 543 కోట్ల డాలర్ల విలువైన ఐదు ఎస్‌-400 స్క్వాడ్రన్ల కొనుగోలుకు భారత్‌ 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు భారత్‌కు చేరాయి. భారత్‌తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు వీలుగా.. గగనతల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన చర్చలను ముందుకు తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నామని బాబుష్కిన్‌ వెల్లడించారు. భారత్‌-పాక్‌ ఘర్షణలో డ్రోన్లను భారీఎత్తున వినియోగించటాన్ని గుర్తు చేస్తూ.. డ్రోన్ల సమస్యను తాము చాలాకాలంగా ఎదుర్కొంటున్నామన్నారు. డ్రోన్లను నిలువరించే సాంకేతికతను తాము ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నామని, భారత్‌-రష్యా రక్షణ భాగస్వామ్యం చర్చల్లో యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు కూడా కీలకాంశమని గుర్తు చేశారు.


ఇవీ చదవండి:

కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్

పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 11:59 AM