రూ 60వేల కోట్లతో 1000 ఐటీఐల పునర్వ్యవస్థీకరణ
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:50 AM
దేశవ్యాప్తంగా కల 3,000 ఐటీఐల్లో వెయ్యి ఐటీఐలను పునర్వ్యవస్థీరిస్తామని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంత్రపెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చెప్పారు...
న్యూఢిల్లీ, జూలై 15: దేశవ్యాప్తంగా కల 3,000 ఐటీఐల్లో వెయ్యి ఐటీఐలను పునర్వ్యవస్థీరిస్తామని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంత్రపెన్యూర్‌షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. ఇందు కోసం రూ.60 వేల కోట్ల నిధులను కేటాయించాలని గత మే నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించిందని మంగళవారం ప్రపంచ యువజన నైపుణ్యాభివృద్థి దినోత్సవం సందర్భంగా మీడియాకు తెలిపారు. ఐటీఐల నిర్వహణకు 2018లో నూతన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత.. గత ఆరేళ్లలో ఆయా సంస్థల్లో 4.5 లక్షల సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వ స్పూర్తి నింపేందుకే ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు జయంత్ చౌదరి తెలిపారు. రెండేళ్లుగా తీసుకున్న చర్యలతో 2024లో ఐటీఐల్లో అడ్మిషన్లు 11ు పెరిగాయన్నారు. ఐటీఐల అప్‌గ్రెడేషన్ విషయమై రాష్ట్రాలతో కలిసి పని చేయాల్సి ఉంటుందన్నారు.
ఇవి కూడా చదవండి:
ఇక సమోసా, జిలేబీలకూ సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు..
మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి