Share News

Gujarat Ropeway Accident: గుజరాత్‌లో రోప్‌ వే ట్రాలీ కూలి ఆరుగురి మృతి

ABN , Publish Date - Sep 07 , 2025 | 05:39 AM

గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా పావ్‌గఢ్‌ హిల్స్‌ మహాకాళి శక్తిపీఠం వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఆలయం సమీపంలో...

Gujarat Ropeway Accident: గుజరాత్‌లో రోప్‌ వే ట్రాలీ కూలి ఆరుగురి మృతి

  • మహాకాళి శక్తిపీఠం వద్ద కేబుల్స్‌ తెగడంతో ఘటన

గాంధీనగర్‌, సెప్టెంబరు 6: గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా పావ్‌గఢ్‌ హిల్స్‌ మహాకాళి శక్తిపీఠం వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఆలయం సమీపంలో కేబుల్‌ రోప్‌ వేకు సంబంధించిన పనులు చేస్తుండగా కార్గో రోప్‌వే ట్రాలీ కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది. టవర్‌పై నుంచి రోప్‌ వే ట్రాలీ ద్వారా నిర్మాణ సామాగ్రిని తరలిస్తుండగా కేబుల్స్‌ తెగి ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్‌ ఆపరేటర్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు కశ్మీరీలు, ఒకరు రాజస్థాన్‌కు చెందినవారున్నారు.

ఇవి కూడా చదవండి..

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

కోహ్లీ పాస్.. లండన్‌లో టెస్ట్‌కు అనుమతి ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2025 | 05:39 AM