Guntur crime: జైలు నుంచి బెయిల్‌పై వచ్చి.. వృద్ధురాలిపై రేప్, హత్య
ABN , Publish Date - Feb 03 , 2025 | 05:36 AM
ఈసారి ఏకంగా 64 ఏళ్ల వృద్ధురాలిని కాటేశాడు. తన కామవాంఛ తీర్చుకున్నాక ఆమెను దారుణంగా హత్య చేశాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

గుంటూరు జిల్లాలో కామోన్మాది ఘాతుకం
ఇంతకు ముందూ అత్యాచారం కేసుల్లోనే జైలుకు
పరారీలో నిందితుడు.. పోలీసుల గాలింపు
పెదనందిపాడు, గుంటూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అత్యాచారం కేసుల్లో జైలుకు వెళ్లిన ఓ కామోన్మాది.. మూడు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలై మరో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈసారి ఏకంగా 64 ఏళ్ల వృద్ధురాలిని కాటేశాడు. తన కామవాంఛ తీర్చుకున్నాక ఆమెను దారుణంగా హత్య చేశాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు భావించినప్పటికీ, ఆ వృద్ధురాలు ఓ ఉన్మాది ఈ ఘాతుకానికి బలైపోయినట్లు గుర్తించారు. నిందితుడు మంజు 2023లో ఇదే తరహా ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 2024లో కూడా ఓ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆ కేసులో జైలులో ఉన్న అతడు మూడు రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యాడు. వృద్ధురాలు స్థానికంగా స్వీపర్‌గా పనిచేసుకుంటూ గుడిసెలో నివాసం ఉంటోంది. శనివారం రాత్రి వృద్ధురాలిపై అత్యాచారం, హత్యకు ఒడిగట్టిన నిందితుడు వెంటనే పరారయ్యాడు.
ఆదివారం ఉదయం పనికి రాకపోవడంతో, అదే గ్రామంలో ఉంటున్న ఆమె కుమార్తె గుడిసె వద్దకు వచ్చి చూడగా.. వృద్ధురాలు రక్తం మరకలతో పాటు ఒంటిపై గాట్లతో కనిపించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి సాంబ, మంజు అనే వ్యక్తులు అనుమానంగా తిరగడం గమనించినట్లు స్థానికులు తెలపడంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరిపి మంజు రేప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలాన్ని ట్రైనీ ఎస్పీ దీక్షిత, డీఎస్పీ భానోదయ పరిశీలించారు. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలం వద్ద క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మధుపవన్ తెలిపారు. వరుస అత్యాచారాలు, హత్యల నేపథ్యంలో మంజు నేర ప్రవృత్తిపై పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడు మంజును త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి