Share News

Sivananda Baba: యోగా గురువు శివానంద బాబా కన్నుమూత

ABN , Publish Date - May 05 , 2025 | 05:08 AM

ప్రముఖ యోగా గురువు శివానంద బాబా వారణాసిలో కన్నుమూశారు. యోగా రంగంలో చేసిన సేవలకు కేంద్రం ఆయనకు 2022లో పద్మశ్రీ పురస్కారం అందించింది.

Sivananda Baba: యోగా గురువు శివానంద బాబా కన్నుమూత

వారణాసి, మే 4: ప్రముఖ యోగా గురువు, ఆధ్యాత్మిక వేత్త శివానంద బాబా వారణాసిలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాబా శనివారం రాత్రి కన్నుమూసినట్లు ఆయన అనుచరులు ప్రకటించారు. బాబా మరణంపై ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక సాధనకు, యోగా రంగానికి శివానంద చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని సిల్హేట్‌ జిల్లాలో 1896వ సంవత్సరంలో ఓ నిరుపేద కుటుంబంలో శివానంద బాబా జన్మించారు. తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే మరణించడంతో గురువు ఓంకార నంద సంరక్షణలో పెరిగారు. గురువు దగ్గరే యోగా, ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను నేర్చుకున్నారు. యోగా రంగంలో శివానంద బాబా చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2022లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.


ఇవి కూడా చదవండి

Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..

India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్

Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన

For National News And Telugu News

Updated Date - May 05 , 2025 | 05:08 AM