Share News

Chennai News: తమిళనాడు తిరువొత్తియూర్‌లో పట్టుబడిన ‘స్పైడర్‌’ కోతి

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:28 AM

స్థానిక తిరువొత్తియూర్‌లో మెక్సికన్‌ జాతికి చెందిన ‘స్పైడర్‌’ కోతిని అటవీ శాఖ సిబ్బంది మంగళవారం రాత్రి బంధించారు. కాలడిపేటలో ప్రాంతంలోని విద్యుత్‌ వైర్లు, చెట్లపై వేలాడుతూ అతివేగంగా వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమచారం ఇచ్చారు.

Chennai News: తమిళనాడు తిరువొత్తియూర్‌లో పట్టుబడిన ‘స్పైడర్‌’ కోతి

చెన్నై: స్థానిక తిరువొత్తియూర్‌లో మెక్సికన్‌ జాతికి చెందిన ‘స్పైడర్‌’ కోతిని అటవీ శాఖ సిబ్బంది మంగళవారం రాత్రి బంధించారు. కాలడిపేటలో ప్రాంతంలోని విద్యుత్‌ వైర్లు, చెట్లపై వేలాడుతూ అతివేగంగా వెళ్లడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. వేళచ్చేరి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని, అతికష్టం మీద కోతిని బంధించి బుధవారం ఉదయం వండలూరు జూ పార్క్‌(Vandaluru Zoo Park) అధికారులకు అప్పగించారు.


nani2.jfif

కాగా, ఇండోనేసియాలో సంచరించే ఈ అరుదైన రకం కోతి ఈ ప్రాంతానికి ఎలా వచ్చిందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారులోని కాట్టుపల్లి హార్బర్‌కు విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తుంగా, ఈ కోతి తప్పిపోయి నగరంలో సంచరిస్తుందా అనే అనుమానం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.


nani2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

పిడుగుపాట్లకు 9 మంది బలి

Read Latest Telangana News and National News

Updated Date - Sep 11 , 2025 | 11:30 AM