Share News

Ranya Rao: పెళ్లయిన నెల నుంచే విడిగా ఉంటున్నాం

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:46 AM

రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ కేసులో తనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ దా ఖలు చేశారు. వారిద్దరూ అనధికారికంగానే విడివిడిగా ఉంటున్నారని హుక్కేరి తరఫు న్యాయవాది ప్రభులింగ్‌ నవదాగి కోర్టులో వెల్లడించారు.

Ranya Rao: పెళ్లయిన నెల నుంచే విడిగా ఉంటున్నాం

కోర్టుకు తెలిపిన రన్యా రావు భర్త జతిన్‌

అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థన

బెంగళూరు, మార్చి 17: గత ఏడాది నవంబరులో తాము వివాహం చేసుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల డిసెంబరు నెల నుంచే విడివిడిగా ఉంటున్నామని కన్నడ నటి రన్యా రావు భర్త జతిన్‌ హుక్కేరి కోర్టుకు తెలిపారు. రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ కేసులో తనకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థిస్తూ పిటిషన్‌ దా ఖలు చేశారు. వారిద్దరూ అనధికారికంగానే విడివిడిగా ఉంటున్నారని హుక్కేరి తరఫు న్యాయవాది ప్రభులింగ్‌ నవదాగి కోర్టులో వెల్లడించారు. ఈ పిటిషన్‌పై ఈనెల 24న తమ అభ్యంతరాలను వెల్లడిస్తామని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) తరఫు న్యాయవాది మధు రావు కోర్టుకు తెలిపారు. అయితే తదుపరి విచారణ వరకు హుక్కేరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ ఆదేశాలు 24వ తేదీ వర కు అమలులో ఉండనున్నాయి. కాగా, రన్యా రావు శరీరం అంతా బం గారం చుట్టుకుని వచ్చిందని, ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నా యో ఆ సమాచారం మొత్తం సేకరించానని బీజేపీ బీజాపూర్‌ సిటీ ఎమ్మె ల్యే బసన్‌గౌడ పాటిల్‌ యత్నాల్‌ విలేకరుల సమావేశంలో చెప్పారు.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:46 AM