BrahMos missile: బ్రహ్మోస్.. ఒక సందేశం
ABN , Publish Date - May 12 , 2025 | 05:00 AM
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ బ్రహ్మోస్ క్షిపణి భారత సైన్యానికి శక్తి సందేశం అని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఉగ్రవాదంపై పోరాటంలో తన వ్యూహాత్మక సంకల్పాన్ని చూపించిందని చెప్పారు.
న్యూఢిల్లీ, లఖ్‌నవూ, మే 11: బ్రహ్మోస్ ఒక ఆయుధం మాత్రమే కాదని.. ఇది భారత సాయుధ బలగాల ‘శక్తి సందేశం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్ సైనిక ప్రధాన కేంద్రం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందని చెప్పారు. లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్‌ను ఆదివారం ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. తాము పాకిస్థాన్ పౌరులను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని, పాక్ మాత్రం భారత్‌లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలపైనా దాడి చేయడానికి ప్రయత్నించిందని అన్నారు.
Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా
Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్