Share News

Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:39 AM

దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Railway Jobs: రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెన్త్‌తో పాటు ఐటీఐ చేసిన వారు, సంబంధిత రంగంలో డిప్లొమా, ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. 2025 జూలై 1వ తేదీ నాటికి 18-30 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన అభ్యర్థులు మే 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంది.


మరోవైపు, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 98 టెక్నిషియన్‌ పోస్టులతో పాటు గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్‌ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. టెక్నిషియన్‌ పోస్టుల్లో డిప్లొమా టెక్నిషియన్‌(మెకానికల్‌) 20, డిప్లొమా టెక్నిషియన్‌(ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌) 26, ఆపరేటర్‌(ఫిట్టర్‌) 34, ఆపరేటర్‌(ఎలక్ట్రిషియన్‌), ఆపరేటర్‌(మెషినిస్ట్‌)3, ఆపరేటర్‌(షీట్‌ మెటల్‌ వర్కర్‌)1 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, ఐటీఐ పాసైన వారు అర్హులు. ఈనెల 18వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు.

Updated Date - Apr 12 , 2025 | 05:39 AM