Police Rescue Passenger: ప్రయాణికుడి అదృష్టం బాగుంది.. రైల్వే పోలీస్ లేకుంటే..
ABN , Publish Date - Aug 07 , 2025 | 08:45 AM
Police Rescue Passenger: లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రైలు రానే వచ్చింది. అయితే, రైలు ఆగి వెళ్లేంత వరకు అతడు లోపలికి ఎక్కలేదు. రన్నింగ్‌లో ఉన్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలులోకి ఎక్కుతుండగా పట్టుతప్పింది.
ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా ప్లాట్ ఫామ్‌ల దగ్గర చోటుచేసుకుంటున్న ప్రమాదాలు తారా స్థాయికి చేరాయి. రన్నింగ్‌లో ఉన్న రైలు ఎక్క బోయి ప్రయాణికులు ప్రాణాలో కోల్పోతున్నారు. చాలా సందర్భాల్లో రన్నింగ్‌లో రైలు ఎక్కబోయి.. రైలు, ప్లాట్ ఫామ్‌ల మధ్యలో పడ్డవారిని తోటి ప్రయాణికులు, రైల్వే పోలీసులు ప్రాణాలు పోకుండా రక్షించారు. తాజాగా కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసు కారణంగా ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ సంఘటన మహారాష్ట్రలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి 11.50 గంటల సమయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్రినస్ బౌండ్‌కు వెళ్లాడు. లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత రైలు రానే వచ్చింది. అయితే, రైలు ఆగి వెళ్లేంత వరకు అతడు లోపలికి ఎక్కలేదు. రన్నింగ్‌లో ఉన్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేశాడు. రైలులోకి ఎక్కుతుండగా పట్టుతప్పింది.
రైలు కిందపడబోయాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసు ఇది గమనించాడు. క్షణాల్లో అతడ్ని పట్టుకుని పక్కకు లాగాడు. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. అతడి ప్రాణాలు రైలు కిందపడి పోయేవి. ఆ ప్రయాణికుడు.. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనిపై సీనియర్ రైల్వే అధికారి మాట్లాడుతూ.. ‘మేము గనుక ఒక సెకన్ లేటు చేసి ఉన్నా.. ఆ వ్యక్తి రైలు కిందపడిపోయే వాడు. మా అధికారులు ఎంతో వేగంగా స్పందించారు. అతడ్ని కాపాడారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఫొటోలోని కారును 12 సెకెన్లలో కనిపెడితే.. మీ బ్రెయిన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
వారందరికీ వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వండి..