Rahul Gandhi: కాంగ్రెస్ తదుపరి లక్ష్యం మమత!!
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:45 AM
మిత్రపక్షాలతో ముఖాముఖి పోరుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఢిల్లీలో ఓటింగ్ శాతం పెంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమికి కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీని టార్గెట్ చేసింది.
బెంగాల్లో రాహుల్ పాదయాత్ర
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: పరస్పర అవగాహన, సర్దుబాట్లతో ‘ఇండీ’ కూటమిని బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్.. తొలుత తాను బలం పుంజుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒంటరిపోరే మార్గమని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారు. మిత్రపక్షాలతో ముఖాముఖి పోరుకు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఢిల్లీలో ఓటింగ్ శాతం పెంచుకుని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఓటమికి కారణమైన కాంగ్రెస్.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. ఆ రాష్ట్రంలో బలపడేందుకు ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఏకంగా పాదయాత్రకు సంకల్పించారు. ఇందుకోసం రాష్ట్ర శాఖ సర్వసన్నాహాలూ చేయాలని అధిష్ఠానం ఆదేశాలు కూడా జారీచేసింది. సోనియాగాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు యూపీఏ సంకీర్ణ ప్రయోగానికి చొరవ చూపడమే గాక పదేళ్లు కేంద్రంలో విజయవంతంగా నడిపారు. 2004లో క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టి ఏఐసీసీ యువజన వ్యవహారాల బాధ్యతలు చేపట్టిన రాహుల్ మాత్రం ఆది నుంచీ భిన్న పంథాలో వెళ్తున్నారు.
పార్టీ ఒంటరిగానే పోరాడాలని.. అప్పుడే బలపడుతుందన్నది ఆయన వైఖరి. దీనివల్ల ఎన్నికల్లో ఓడిపోయినా.. భవిష్యత్‌లో లాభం కలుగుతుందని తన సన్నిహిత నేతలతో ఆయన తరచూ చెప్పేవారు. అయితే వరుస ఓటములు, ప్రధాని మోదీని ఓడించాలన్న ఆకాంక్ష కారణంగా సంకీర్ణ రాజకీయాలపై రాజీపడాల్సి వచ్చింది. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత.. ఇండీ కూటమి పార్టీలు బలపడి.. కాంగ్రెస్ మాత్రం బలహీనపడుతోందని రాహుల్ గ్రహించారు. అందుకే ఎంతో లోతుగా ఆలోచించి.. మొదట పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు. బెంగాల్లో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపు అక్కడ కాంగ్రె్‌సను పునరుజ్జీవింపజేయడానికి నేరుగా రాహులే నడుం బిగించారు.
ఇవి కూడా చదవండి..
Maha Kumbhmela 2025 : మహా కుంభమేళాకు రాష్ట్రపతి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం..
Delhi elections: హామీల అమలు బీజేపీకి సవాలే!
For More National News and Telugu News..