Rahul Gandhi : మేకిన్ ఇండియా విఫలం..మోదీ గుర్తించాలి
ABN , Publish Date - Feb 06 , 2025 | 05:09 AM
జీడీపీలో తయారీ రంగం వాటా 2104లో 15.3 శాతంగా ఉంటే ఇప్పుడది 12.6శాతానికి పడిపోయిందని.. ఇది గత 60ఏళ్లలో అత్యంత కనిష్ఠం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పేర్కొన్నారు. లోక్ సభలో మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ‘మేకిన్ ఇండియా’ గురించి మాట్లాడలేదని.. ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ మంచి కార్యక్రమమే
పట్నా, ఫిబ్రవరి 5: జీడీపీలో తయారీ రంగం వాటా 2104లో 15.3 శాతంగా ఉంటే ఇప్పుడది 12.6శాతానికి పడిపోయిందని.. ఇది గత 60ఏళ్లలో అత్యంత కనిష్ఠం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పేర్కొన్నారు. లోక్ సభలో మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ‘మేకిన్ ఇండియా’ గురించి మాట్లాడలేదని.. ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ మంచి కార్యక్రమమే అయినా అది విఫలమైందనే విషయాన్ని ప్రధాని గుర్తించాలని అన్నారు. దళితనేత, స్వాతంత్య్ర సమరయోధుడు జగ్‌లాల్ చౌదరీ జయంతి సందర్భంగా బుధవారం పట్నాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడితే.. ఎన్నికల్లో అణగారిన వర్గాలకు టికెట్లు ఇవ్వడం ద్వారా వారికి ప్రాతినిధ్యం కల్పించామని గొప్పగా చెబుతుంటారని.. అయితే ఆ వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి అన్ని అధికారాలనూ ఆయన లాగేసుకున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రులు కూడా పేరుకే ఉన్నారని.. ఆర్‌ఎ్‌సఎస్ సిఫారసు చేసిన ఓఎస్డీలే శాఖలపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Delhi Exit Polls: కమల వికాసం...ఎగ్జిట్ పోల్స్ జోస్యం
Delhi Elections 2025 : అడుగడునా బారికేడ్లు..ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు.. ఢిల్లీ పోలీసులపై మంత్రి ఫైర్
Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి