Modi Rahul Meet: మోదీతో రాహుల్ భేటీ
ABN , Publish Date - May 06 , 2025 | 04:43 AM
ప్రధానమంత్రి మోదీతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సైన్యం సన్నద్ధతపై చర్చతోపాటు సీబీఐ కొత్త చీఫ్ ఎంపికపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు
సైన్యం సన్నద్ధతపై ప్రస్తావన
సీబీఐ చీఫ్ ఎంపికపై చర్చలు
న్యూఢిల్లీ, మే 5: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పహల్గాం దుర్ఘటన అనంతరం తలెత్తిన పరిస్థితులు, సైన్యం సన్నద్ధతపై రాహుల్‌తో అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. నిజానికి ఈ సమావేశం సీబీఐ తదుపరి చీఫ్ ఎంపిక కోసం జరిగింది. సీబీఐ చీఫ్‌ను ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. దాంతో రాహుల్‌తో పాటు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ప్రధాని కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుత సీబీఐ చీఫ్ ప్రవీణ్ సూద్ ఈ నెలలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.