Share News

Rahul Gandhi: జైశంకర్‌.. మౌనం వీడండి

ABN , Publish Date - May 20 , 2025 | 04:54 AM

ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనం ఉంటున్నారని, యుద్ధ విమానాలు ఎంత నష్టమయ్యాయో వెల్లడించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పాక్‌కు ఆపరేషన్ గురించి సమాచారం leaked అయిన విషయంపై ఆయన తీవ్ర ప్రశ్నలు వేస్తున్నారు.

Rahul Gandhi: జైశంకర్‌.. మౌనం వీడండి

న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ మౌనం వీడాలని, ఆ సమయంలో భారత్‌ ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయిందో సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌పై పాక్‌కు ముందే సమాచారం ఇచ్చామంటూ జైశంకర్‌ మాట్లాడుతున్న వీడియోపై తీవ్ర విమర్శలు గుప్పించిన మరుసటి రోజే రాహుల్‌ గాంధీ.. యుద్ధ విమానాలపై కేంద్రాన్ని నిలదీయడం గమనార్హం. ‘‘పాకిస్థాన్‌కు మన ఆపరేషన్‌ గురించి సమాచారం ఇవ్వాలని జైశంకర్‌కు ఎవరు చెప్పారు’’ అని రాహుల్‌ ప్రశ్నించారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:54 AM