Share News

Rahul Gandhi: 90ల తర్వాత దళితుల కోసం పోరాడలేకపోయాం

ABN , Publish Date - Feb 01 , 2025 | 05:07 AM

ఆదివాసీల హక్కుల కోసం సమర్థంగా పోరాడలేకపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దళిత ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: 90ల తర్వాత దళితుల కోసం పోరాడలేకపోయాం

న్యూఢిల్లీ, జనవరి 31: ఇందిరాగాంధీ హయాంతో పోలిస్తే.. కాంగ్రెస్‌ పార్టీ 1990ల తర్వాత దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీల హక్కుల కోసం సమర్థంగా పోరాడలేకపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. దళిత ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీయేతర కుటుంబ వ్యక్తులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ ప్రధానులుగా చేసిన కాలానికి సంబంఽధించి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘పీవీ నరసింహారావు ప్రతీది నాశనం చేశారు’ అని ప్రేక్షకుల్లో ఒకరు అనగా.. దానికి రాహుల్‌ నవ్వుతూ.. ‘నేను ఎవరి పేరు చెప్పను, వాస్తవాన్ని కాంగ్రెస్‌ అంగీకరించాల్సి ఉంటుంది’ అని సమాధానం ఇచ్చారు.


పార్టీలో అణగారిన వర్గాల పాత్ర పెరగాలంటే.. అంతర్గత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత 10-15 ఏళ్లలో తమ పార్టీ చేయాల్సిన పనిని చేయలేదని ఒక కాంగ్రెస్‌ సైనికుడిగా చెప్పగలనని పేర్కొన్నారు. కాంగ్రె్‌సపై దళితులు, వెనుకబడిన వర్గాలకు గతంలో ఉన్న విశ్వాసాన్ని తర్వాత కూడా కొనసాగించి ఉంటే.. ఆరెస్సెస్‌, బీజేపీలకు అధికారం వచ్చేదికాదని చెప్పారు.


ఇవి కూడా చదవండి

PM Modi: వికసిత్ భారత్‌కు ఊతమిచ్చేలా బడ్జెట్

Parliament: శీతాకాల సభల్లో సెగలే!

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 05:07 AM