Rahul Gandhi: తరచు బీహార్‌కు రాహుల్... వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:41 PM
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పనిచేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. బీహార్‌లో అదనపు సీట్లు దక్కించుకునే అవకాశంపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ 'ఏ' టీమ్‌గా ఉండబోతోందని, బీ టీమ్‌గా కాదని చెబుతున్నారు.
పాట్నా: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి బీహార్ (Bihar)లో పర్యటించారు. గత మూడు నెలల్లో ఆయన బీహార్‌లో పర్యటించడం ఇది మూడోసారి. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ఎన్డీయే కూటమిని గద్దెదింపాలనే వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే బెగుసరాయ్ జిల్లాలో కాంగ్రెస్ నిర్వహించిన 'పలాయన్ రోకో, నౌకరీ దో' పాదయాత్రలో రాహుల్ గాంధీ సోమవారంనాడు పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు ఎన్ఎస్‌యూఐ జాతీయ ఇన్‌చార్జి కన్హయ్య కుమార్ నేతృత్వం వహించారు.
Kunal Kamra: కునాల్ కామ్ర ముందస్తు బెయిలు పొడిగింపు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పనిచేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించింది. బీహార్‌లో అదనపు సీట్లు దక్కించుకునే అవకాశంపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ ఆ పార్టీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమ పార్టీ 'ఏ' టీమ్‌గా ఉండబోతోందని, బీ టీమ్‌గా కాదని చెబుతున్నారు. ఆ క్రమంలో బీహార్‌లో మరిన్ని సీట్లు రాబట్టుకోవడమే కాంగ్రెస్ పార్టీ తాజా వ్యూహంగా చెబుతున్నారు. బీహార్‌లో ఎంప్లాయిమెంట్ ఎజెండాకు మద్దతుగా తాను యాత్రలో పాల్గొంటున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించడం కూడా ఇందులో భాగంగానే అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆర్జేడీ పొత్తుతో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేసినప్పటికీ 19 సీట్లు మాత్రమే దక్కించుకుంది.
బెగుసరాయ్‌లో పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ సోమవారం ఒక వీడియో సందేశంలో ''బీహార్ యువస్నేహితులారా, నేను ఏప్రిల్ 7న బెగుసరాయ్ వస్తున్నాను. పలాయన్ రోకో, నౌకరీ దో యాత్రలో మీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాను'' అని పేర్కొన్నారు. బీహార్ ప్రజల సెంటిమెంట్లు, ఇబ్బందులు, పోరాటం యావత్ ప్రపంచం చూడాలని, యువకులంతా తెల్లటి టీ-షర్ట్‌తో పాదయాత్రలో పాల్గొని బలంగా తమ గొంతు వినిపించాలని, సమస్యలపై ప్రశ్నించాలని అన్నారు. యువత తమ హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ప్రభుత్వాన్ని గద్దెదించాలని, వైట్ షర్ట్ మూమెంట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. అవకాశాల రాష్ట్రంగా బీహార్‌ను తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
For National News And Telugu News