Share News

Donald Trump: పుతిన్‌ పిచ్చోడు

ABN , Publish Date - May 27 , 2025 | 04:54 AM

ఉక్రెయిన్‌పై పుతిన్‌ దాడులపై ట్రంప్‌ స్పందించారు. పుతిన్‌ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని, జెలెన్‌స్కీ నోరు మూస్తే ఉక్రెయిన్‌కు మంచిదని వ్యాఖ్యానించారు.

Donald Trump: పుతిన్‌ పిచ్చోడు

వాషింగ్టన్‌, మే 26: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని, అవసరం లేకపోయినా చాలామందిని చంపేస్తున్నారని విమర్శించారు. పుతిన్‌తో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. అయితే పుతిన్‌కు అప్పుడప్పుడు ఏమవుతుందో అర్థం కావడం లేదని, ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారంటూ ఆయన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు. ఉక్రెయిన్‌ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని పుతిన్‌ యత్నిస్తున్నారని, అలా జరిగితే రష్యా పతనం తప్పదని ట్రంప్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై కూడా ట్రంప్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. జెలెన్‌స్కీ మాట్లాడే తీరువల్లే ఉక్రెయిన్‌కు చేటు జరుగుతోందన్నారు. జెలెన్‌స్కీ నోరు విప్పితే చాలు సమస్యలు తలెత్తుతున్నాయని, ఆయన మౌనంగా ఉంటే మంచిదని ట్రంప్‌ సలహా ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదని ట్రంప్‌ చెప్పారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహా అనేక నగరాలపై రష్యా 367 డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి జరపడంతో 14 మంది చనిపోయారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 04:54 AM