Pushkar Cattle Fair: రూ. 15 కోట్ల ‘షాబాజ్’.. రూ. 23 కోట్ల ‘అన్మోల్’
ABN , Publish Date - Oct 28 , 2025 | 05:57 PM
రాజస్థాన్‌లో ప్రతియేటా నిర్వహించే ప్రసిద్ధ పుష్కర్ పశువుల ప్రదర్శన (Pushkar Cattle Fair) ఈసారి విపరీతమైన సందడిని సంతరించుకుంది. వేలాది జంతువులకు ఆతిథ్యం ఇస్తున్న ఈ వార్షిక వేడుకలో ఈసారి రెండు జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 28: రాజస్థాన్‌లో ప్రతియేటా నిర్వహించే ప్రసిద్ధ పుష్కర్ పశువుల ప్రదర్శన (Pushkar Cattle Fair) ఈసారి విపరీతమైన సందడిని సంతరించుకుంది. వేలాది జంతువులకు ఆతిథ్యం ఇస్తున్న ఈ వార్షిక వేడుకలో ఈసారి రెండు జంతువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రూ.15 కోట్ల విలువైన గుర్రం, రూ.23 కోట్ల విలువైన గేదె రికార్డ్ కెక్కింది. దేశ–విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు, పర్యాటకులు ఈ జంతువులను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
రూ. 15 కోట్ల ‘షాబాజ్’
ఛండీగఢ్‌కు చెందిన గ్యారీ గిల్ అనే వ్యక్తి వద్ద ఉన్న ‘షాబాజ్’ అనే మార్వారీ జాతి గుర్రం ఈ ఫెయిర్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. వయసు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే అయినా, ఇప్పటికే పలు ప్రదర్శనల్లో ప్రతిభ చూపిన ఈ గుర్రం విలువ రూ.15 కోట్లు అని యజమాని తెలిపారు. షాబాజ్ పెంపకం ఖర్చు నెలకు రూ.2 లక్షలే అయినా, దాని అందం, శక్తి, నడక తీరు వల్ల దీనికి ఈ భారీ ధర చెప్పడం విశేషం.
రూ. 23 కోట్ల ‘అన్మోల్’
ఇక రాజస్థాన్‌కు చెందిన రైతు వద్ద ఉన్న ‘అన్మోల్’ అనే గేదె కూడా రికార్డు సృష్టించింది. దీని విలువ రూ.23 కోట్లు అని యజమాని తెలిపారు. అన్మోల్‌ను రాజ కుటుంబ సభ్యుల్లా పెంచుతున్నట్లు ఆయన వివరించారు. రోజూ దీనికి పాలు, దేశీ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి ప్రత్యేక ఆహారం ఇస్తున్నారని చెప్పారు. పశువుల ఫుష్కర ఫెయిర్‌లో వీటితోపాటు రాణ అనే గేదె రూ. 25 లక్షలు పలకగా, బాదల్ అనే మరో ఛాంపియన్ హార్స్ రూ. 11 కోట్లు వరకు పలికింది.
పుష్కర్ ఫెయిర్ విశేషాలు
ప్రతి సంవత్సరం పశుసంవర్ధక సంప్రదాయాల పరిరక్షణకు గుర్తుగా పుష్కర్ పశువుల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇందులో ఉత్తమ పాల ఉత్పత్తి చేసే జంతువులు, ఉత్తమ గుర్రపు జాతి, ఉత్తమంగా అలంకరించిన ఒంటెలకు బహుమతులు అందజేస్తారు. అక్టోబర్ 23న ప్రారంభమైన ఈ ఫెయిర్ నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3,021 ప్రత్యేక జంతువులు ప్రదర్శనలో నమోదు అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
ECI: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
Mentha Cyclone: మొంథా తుపాన్‌పై ఆరా.. రైల్వే మంత్రి కీలక ఆదేశాలు