Punjab Government: పంజాబ్‌లో లేని శాఖకు మంత్రిగారు!
ABN , Publish Date - Feb 23 , 2025 | 05:24 AM
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు తరువాత గుర్తించింది. దానిని సవరించేందుకు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఆ విషయం వెల్లడయింది. పంజాబ్‌లో 2022, మార్చిలో భగవంత్ మాన్ నేతృత్వంలో ఏర్పడిన ఆప్ ప్రభుత్వం...

చండీగఢ్, ఫిబ్రవరి 22: పంజాబ్‌లో ఉనికిలో లేని ఓ శాఖకు ఓ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు తరువాత గుర్తించింది. దానిని సవరించేందుకు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌తో ఆ విషయం వెల్లడయింది. పంజాబ్‌లో 2022, మార్చిలో భగవంత్ మాన్ నేతృత్వంలో ఏర్పడిన ఆప్ ప్రభుత్వం... మే, 2023లో మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసింది. ఆ క్రమంలో అప్పటి వరకూ వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖలను నిర్వహించిన కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌కు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను అప్పగించింది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ప్రభుత్వంలో లేదు.
విశ్వసనీయ వర్గాల కథనం మేరకు తనకు కేటాయించిన శాఖకు కార్యదర్శి లేకపోవడంతో ధలివాల్ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరినట్లు తెలిసింది. అయితే తాజాగా ఫిబ్రవరి 7న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజిట్ విడుదల చేశారు. దీనిపై బీజేపీ విమర్శలకు దిగింది. ‘పంజాబ్‌లో పాలనను ఆప్ జోక్‌గా మార్చింది. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా ఆ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విషయం సీఎంకు కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి’ అని ఎద్దేవా చేసింది.
ఇవి కూడా చదవండి..
Kerala: కేరళలో సంచలనం సృష్టిస్తున్న సామూహిక ఆత్మహత్యలు.. అసలేం జరిగిందంటే..
Delhi: ఛావా ఎఫెక్ట్.. సైన్‌బోర్డులపై బ్లాక్ స్ప్రే, శివాజీ పోస్టర్లు
Maha Kumbh Mela 2025: మహాకుంభ మేళా ఎఫెక్ట్.. ఫిబ్రవరి 25-28 వరకు ఈ రైళ్లు రద్దు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.