Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎంపీ వీడియో..
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:07 PM
సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తూ.. తొలిసారి ఎన్నికల బరిలో ఆమె దిగారు. అంతే జాక్ పాట్ కొట్టేసింది. ఆమె తండ్రి సైతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
న్యూఢిల్లీ, జులై 22: పొలంలో వరి నాట్లు వేస్తున్న సమాజ్ వాదీ నేత, ఎంపీ ప్రియా సరోజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన పూర్వీకుల గ్రామం వారణాసిలో అమూల్ డైరీ సమీపంలోని కరాఖియావ్‌లో గ్రామస్తులతో కలిసి వరి నాట్లు వేశారు. అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై పార్టీ కార్యకర్తలతోపాటు మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ప్రియా సరోజ్ ఇలా గ్రామానికి వచ్చి వరి నాట్లు వేయడం సంతోషంగా ఉందని అంటున్నారు. అంతేకాదు నెటిజన్లు సైతం ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ (రిజర్వుడ్) లోక్‌సభ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలో ప్రియా సరోజ్ నిలిచి.. గెలిచారు. ఆమె తండ్రి తుఫానీ సరోజ్. ఆక్ష్న జౌన్‌పూర్‌లోని కెరకట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రియా సరోజ్.. వృత్థిరీత్యా సుప్రీంకోర్టు న్యాయవాది. తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఆమె విజయం సాధించారు.
ఇక అలీఘడ్‌కు చెందిన భారత క్రికెటర్ రింకు సింగ్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో వీరి వివాహం జరగనుంది. అందుకు ముహూర్తం సైతం ఖరారైంది. మరోవైపు తాను తమ పొలంలో పని చేశానంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21 నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు జరగనున్నాయని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తాను ఢిల్లీ వెళ్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి