Share News

Prime Minister Modi : ఎంతో బాధాకరం

ABN , Publish Date - Jan 30 , 2025 | 03:47 AM

మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంతో బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధితులకు ప్రయాగ్‌రాజ్‌లోని స్థానిక యంత్రాంగం అన్ని విధాల సహాయం చేస్తోందని ఆయన తెలిపారు.

Prime Minister Modi : ఎంతో బాధాకరం

కుంభమేళా తొక్కిసలాటపై యోగీకి మోదీ ఫోన్‌

న్యూఢిల్లీ, జనవరి 29: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంతో బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు. బాధితులకు ప్రయాగ్‌రాజ్‌లోని స్థానిక యంత్రాంగం అన్ని విధాల సహాయం చేస్తోందని ఆయన తెలిపారు. బాఽధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాట ఘటనపై పరిస్థితిని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు ఆయన పలుమార్లు ఫోన్‌ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. తొక్కిలాట ఘటన ఎంతో బాధకలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వార్త ఎంతో బాధించిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే చెప్పారు.


అరకొర ఏర్పాట్ల వల్లే ప్రమాదం:

అరకొర ఏర్పాట్ల వల్లే కుంభమేళాలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు మృత్యువాత పడ్డారని ప్రతిపక్షాలు కేంద్రం, యూపీలోని యోగీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. పాలన యంత్రాంగం సామాన్య భక్తుల గురించి కాకుండా వీవీఐపీల తరలింపుపై దృష్టిపెట్టడం వల్లే దుర్ఘటన సంభవించిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అరకొర ఏర్పాట్లు, వీఐపీ తరలింపు, స్వంత ప్రచారంపై శద్ధ్ర చూపడం, నిర్వహణ లోపాలే ఈ ప్రమాదానికి కారణమని ఖర్గే పేర్కొన్నారు. వీవీఐపీల రాకపోకలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన యోగీ ప్రభుత్వ వైఫల్యమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. కుంభమేళాకు ప్రపంచ స్థాయి ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలన్నారు. కుంభమేళా నిర్వహణను ఆర్మీకి అప్పగించాలని అన్నారు. కాగా, పరిపాలన యంత్రాంగం వీఐపీల భద్రత ఏర్పాట్లలో మునిగితేలుతూ బీజీగా ఉండడం వల్లే ఇంత ఘోరం జరిగిందని నిరంజనా మహామండలేశ్వరుడు స్వామి ప్రేమానంద్‌ పూరీ విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 30 , 2025 | 03:47 AM