Assembly Speaker: రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత సులభం కాదు..
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:07 PM
వెండి తెరపై నటించినంతగా రాజకీయాల్లో నటించడం సులభం కాదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ అప్పావు వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో శుక్రవారం డీఎంకే కూటమి నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
- స్పీకర్ అప్పావు
చెన్నై: వెండి తెరపై నటించినంతగా రాజకీయాల్లో నటించడం సులభం కాదని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ అప్పావు(Assembly Speaker Appau) వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో శుక్రవారం డీఎంకే కూటమి నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరూర్‌లో గత శనివారం 19 అడుగుల వెడల్పు రోడ్డులో 12 అడుగుల వెడల్పు కలిగిన వాహనంలో నిల్చుని విజయ్ రోడ్‌షో నిర్వహించడం వల్లే తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు గాల్లో కలిశాయని,
దీనికి ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విజయ్ ఏడు నిమిషాల షూటింగ్ ముగించుకుని ప్రాణాలు కోల్పోయిన వారి గురించి పట్టించుకోకుండా వెంటనే ప్రత్యేక విమానంలో చెన్నైకి పారిపోయారని, అయితే ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) కరూర్ దుర్ఘటన సమాచారం తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే కరూర్ వెళ్లి బాధితులను పరామర్శించి ఓదార్చారని, మృతులకు అంజలి ఘటించారని,

అక్కడే ఉండి సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో జాప్యం లేకుండా సహాయ కార్యక్రమాలు చేయించారన్నారు. తన రోడ్‌షోలో తొక్కిసలాటలో మృతిచెందిన వారి బంధువులను, క్షతగాత్రులను పరామర్శించకుండా వెళ్లిన విజయ్ రాజకీయ అజ్ఞాని అని, ఆయనకు ఆర్‌ఎ్‌సఎస్, బీజేపీ పెద్దల అండదండలున్నాయని స్పీకర్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విజయ్ దేవరకొండ - రష్మిక నిశ్చితార్థం.. అనుకున్నదే జరిగింది
పెరిగిన ఆధార్ అప్‌డేట్ ఛార్జీలు.. ఏ సేవకి ఎంత చెల్లించాలంటే
Read Latest Telangana News and National News