Share News

PM Modi: రైల్వే టికెట్లపై సిందూర్‌ ప్రకటన.. కాంగ్రెస్‌ ఫైర్‌

ABN , Publish Date - May 20 , 2025 | 04:50 AM

ప్రధాని మోదీ ఫొటోతో ఆపరేషన్ సిందూర్ ప్రకటన రైల్వే టికెట్లపై చూపించడం రాజకీయ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్‌ బీజేపీని సైనిక ఆపరేషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న다고 ఆరోపించింది.

PM Modi: రైల్వే టికెట్లపై సిందూర్‌ ప్రకటన.. కాంగ్రెస్‌ ఫైర్‌

న్యూఢిల్లీ, మే 19: రైల్వే టికెట్లపై ప్రధాని మోదీ ఫొటోతో కూడిన ఆపరేషన్‌ సిందూర్‌ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సైనిక ఆపరేషన్‌ను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌ నాథ్‌ మీడియా సలహాదారు పియూష్‌ బబెలే ఐఆర్‌సీటీసీ ఈ- టికెట్‌ ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘మోదీ సర్కారుకు ప్రకటనలపై ఎంత మక్కువ ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఆపరేషన్‌ సిందూర్‌ను రైల్వే టికెట్లపై ఒక ప్రకటనగా వాడుకుంటున్నారు. మన సైనికుల పరాక్రమాన్ని కూడా ఒక వస్తువులా అమ్ముకుంటున్నారు. ఇది దేశ భక్తి కాదు.. బేరసారమే’’ అని బబెలే ఎక్స్‌లో రాశారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:50 AM