Share News

Karnataka: మైసూరు దసరా ఉత్సవాలపై వివాదం

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:13 AM

మైసూరు దసరా ఉత్సవాలను ఈ ఏడాది బుకర్‌ ప్రైజ్‌ విజేత బాను ముస్తాక్‌ చేత ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంపై కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

Karnataka: మైసూరు దసరా ఉత్సవాలపై వివాదం

బెంగళూరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాలను ఈ ఏడాది బుకర్‌ ప్రైజ్‌ విజేత బాను ముస్తాక్‌ చేత ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించడంపై కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కన్నడ మాతగా భువనేశ్వరీదేవిని ఎలా అంగీకరించాలని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాను ముస్తాక్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. భువనేశ్వరీదేవిని కన్నడ మాతగా అంగీకరించని బాను ముస్తాక్‌, చాముండేశ్వరి దేవికి పుష్పార్చన ఎలా చేస్తారని, చాముండేశ్వరి దేవిపై ఆమెకు నమ్మకం ఉందా అని కేంద్రమంత్రి శోభా కరంద్లాజె ప్రశ్నించారు.

Updated Date - Aug 26 , 2025 | 01:13 AM