Operation Sindoor: సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన
ABN , First Publish Date - May 12 , 2025 | 08:27 PM
PM Modi Speech on Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశారు.
Live News & Update
-
May 12, 2025 22:58 IST
భారత్-పాక్ మధ్య శాంతి చర్చలకు వెళ్లకుండా అడ్డుకుంది : కేఏ పాల్
భారత్-పాక్ మధ్య శాంతి చర్చలకు, శిఖరాగ్ర సమావేశానికి వెళ్లకుండా ఇండిగో ఎయిర్ లైన్స్ అడ్డుకుందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. బాయ్ కాట్ ఇండిగో అంటూ ఎక్స్ లో కే.ఏ.పాల్ పోస్ట్ చేశారు. 18 ఏళ్లుగా ఎయిర్ లైన్స్ నడుపుతున్న ఇండిగో కోట్లాది మందిని మోసం చేసింది.. ఇండిగో ఎయిర్ లైన్స్ పై కోర్టుకు వెళ్తాను. వదిలే ప్రసక్తే లేదు అంటూ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
May 12, 2025 22:45 IST
IPL రీషెడ్యూల్ విడుదల
మే 17 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు
6 వేదికల్లో 17 మ్యాచ్‌లు
మే 29న మొదటి క్వాలిఫయర్ మ్యాచ్
మే 30న ఎలిమినేటర్ మ్యాచ్
జూన్ 1న రెండో క్వాలిఫయర్ మ్యాచ్
జూన్ 1న రెండో క్వాలిఫయర్ మ్యాచ్
జూన్ 3న ఫైనల్ మ్యాచ్
క్వాలిఫయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించని BCCI
13 లీగ్ మ్యాచ్‌లు సహా జరగనున్న మొత్తం 17 మ్యాచ్‌లు
ఈనెల 17 నుంచి మళ్లీ IPL మ్యాచ్‌లు
-
May 12, 2025 22:29 IST
భారతదేశ విదేశీ విధానంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా: కాంగ్రెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నట్టు కశ్మీర్ అంశంపై అగ్రరాజ్య ప్రమేయం ఉంటుందా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ఈ మేరకు మోదీ సర్కారుని పలు ప్రశ్నలు వేశారు. "భారతదేశ విదేశీ విధానంలో ఏమైనా మార్పులు చోటుచేసుకున్నాయా..? భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి మూడో పక్షాన్ని అనుమతించి సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారా..?’ అని వేణుగోపాల్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తన జోక్యం ఉందని పేర్కొంటూ ప్రతిరోజూ ప్రకటనలు చేస్తున్నారని.. వీటిపై కేంద్ర స్పష్టత ఇవ్వాలన్నారు.
-
May 12, 2025 21:56 IST
జమ్మూలోని 3 జిల్లాల్లో ఆర్మీ, BSF కేంద్రాలపై తిరుగుతున్న డ్రోన్లు
డ్రోన్లను కుప్పకూల్చిన భారత క్షిపణి రక్షణ వ్యవస్థ
-
May 12, 2025 21:26 IST
సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన..
కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు.
జమ్మూకశ్మీర్ సాంబా సెక్టార్‌లో పాక్ కాల్పులు.
ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత.
పంజాబ్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్ అవుట్.
పంజాబ్, రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో బ్లాక్ అవుట్.
-
May 12, 2025 20:54 IST
పాకిస్థాన్ నిఘా, సాంకేతికత భారత్ ముందు తేలిపోయింది: మోదీ
ఉగ్రవాదులను నియంత్రించాల్సిన పాక్ మనపై ఎదురుదాడి చేసింది.
పాకిస్థాన్ మన స్కూల్స్, ఆస్పత్రులు, గురుద్వారాలను టార్గెట్ చేసింది.
పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేశాం.
పాక్ మిస్సైల్స్ భారత్‌లోకి అడుగుపెట్టలేకపోయాయి.
మనమాత్రం పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చాం.
ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాం.
మన దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడిపోయింది.
భారత్‌ను ఎదుర్కోలేక ప్రపంచ దేశాల సాయం కోరింది.
పాకిస్థాన్ చర్యలను బట్టే మన చర్యలు ఉంటాయి.
పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్దా తిప్పికొడతాం.
-
May 12, 2025 20:37 IST
ఉగ్రవాదం ఉన్న చోట వాణిజ్యం ఉండదు: ప్రధాని మోదీ
రక్తం పారిన చోట జలాలు ప్రవహించవు.
పాకిస్థాన్‌తో చర్చలు అంటేనే ఉగ్రవాదంపైనే.
పాకిస్థాన్‌తో చర్చలు అంటే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే.
పాకిస్థాన్ బతకాలంటే తనంతట తానుగా ఉగ్రవాదాన్ని నియంత్రించాలి.
ఉగ్రవాదం, చర్చలు ఒకే సమయంలో ఉండవు.
ఉగ్రవాదాన్ని ఉపేక్షించం.
-
May 12, 2025 20:36 IST
పాక్ మిస్సైల్స్ భారత్‌లోకి రాలేకపోయాయి: ప్రధాని మోదీ
మనమాత్రం పాకిస్థాన్ గుండెల్లో బాంబులు పేల్చాం.
ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాం.
మన దెబ్బకు పాకిస్థాన్ విలవిలలాడిపోయింది.
భారత్‌ను ఎదుర్కోలేక ప్రపంచ దేశాల సాయం కోరింది.
పాకిస్థాన్ చర్యలను బట్టే మన చర్యలు ఉంటాయి.
పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడ్దా తిప్పికొడతాం.
పాక్ అణు బ్లాక్ మెయిలింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో సహించం.
మేకిన్ ఇండియా అస్త్రాలను వాడే సమయం ఆసన్నం అయింది.
త్రివిధ దళాలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాయి.
ఉగ్రవాదం అంతానికి అన్నిరకాల వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాం.
పాక్ తోకజాడిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది.
-
May 12, 2025 20:34 IST
ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశాం: మోదీ
100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చాం.
ఉగ్రవాదులపై దాడులకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.
సైన్యం చేసిన దాడికి పాకిస్థాన్ నివ్వెరపోయింది.
పాకిస్థాన్ నిఘా, సాంకేతికత భారత్ ముందు తేలిపోయింది.
ఉగ్రవాదులను నియంత్రించాల్సిన పాక్ మనపై ఎదురుదాడి చేసింది.
పాకిస్థాన్ మన స్కూల్స్, ఆస్పత్రులు, గురుద్వారాలను టార్గెట్ చేసింది.
పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేశాం.
-
May 12, 2025 20:28 IST
మనదేశం వీరత్వాన్ని చాటుకుంది: ప్రధాని మోదీ
మన మహిళల సిందూరాన్ని దూరం చేస్తే.. ఏమవుతుందో చూపించాం.
ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాం.
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశాం.
-
May 12, 2025 20:27 IST
ఆపరేషన్ సిందూర్ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న మోదీ
ఆపరేషన్ సిందూర్‌లో బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి: మోదీ
మన సైన్యం చూపిన తెగువకు సెల్యూట్ చేస్తున్నా.
భారత సైన్యానికి, శాస్త్రవేత్తలకు సెల్యూట్.
అమాయక పౌరులను పాకిస్థాన్ పొట్టనపెట్టుకుంది.
కుటుంబసభ్యుల ముందే అయినవారిని చంపేశారు.
మతం పేరు అడిగి మరీ పర్యాటకులను క్రూరంగా చంపారు.
ఉగ్రవాదంపై చర్యను దేశమంతా అండగా నిలిచింది.
ఆపరేషన్ సిందూర్‌తో సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నాం.