Share News

PM Modi: మోదీ అధ్యక్షతన సీసీఎస్‌ భేటీ

ABN , Publish Date - May 15 , 2025 | 04:38 AM

భారత్-పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్‌ భద్రతా సమావేశం మొదటిసారి జరిగింది. దేశ భద్రత, సన్నద్ధతపై కీలక చర్చలు జరిగాయి. విదేశాంగ మంత్రి జైశంకర్‌ భద్రతా స్థాయిని పెంచుకుని సెక్యూరిటీ పథకాలు బలోపేతం చేశారు.

PM Modi: మోదీ అధ్యక్షతన సీసీఎస్‌ భేటీ

న్యూఢిల్లీ, మే 14: ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమావేశం జరిగింది. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ తర్వాత సీసీఎస్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. తాజా భద్రతా పరిస్థితులు, దేశ సన్నద్ధతపై సమావేశంలో చర్చించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. కాగా, మహా దళపతి (సీడీఎస్‌) అనిల్‌ చౌహాన్‌తో పాటు త్రివిధ దళాధిపతులు బుధవారం రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్మును కలిసి ఆపరేషన్‌ సిందూర్‌ గురించి వివరించారు. మరోవైపు, భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ భద్రతను కేంద్రం మరింత పెంచింది. ఇటీవల జరిపిన సమీక్షలో భాగంగా ఆయనకు ప్రస్తుతం కల్పిస్తున్న జెడ్‌ కేటగిరీ సెక్యూరిటీలో మరో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను చేర్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:38 AM